Trisha: త్రిష ఆ పని చేస్తే సినిమా సూపర్ హిట్టే.. సూర్య ‘కరుప్పు’లోనూ అదే జరిగింది
గత కొన్ని రోజులుగా త్రిష పేరు మార్మోగుతోంది. హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు ఈ ముద్దుగుమ్మ పేరే బాగా ట్రెండింగ్ అయ్యింది. ఇప్పుడు కరుప్పు సినిమా భారీ సక్సెస్ తో మరోసారి ఈ బ్యూటీ పేరు హోరెత్తుతోంది

స్టార్ హీరోయిన్ త్రిష సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరోస్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఆమె భాగం కావడమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించి ఓ అభిమాని చేసిన పోస్ట్ వైరల్ కాగా… దాన్ని త్రిష కూడా తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. వివరాల్లోకి వెళితే.. సూర్య హీరోగా నటించిన కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మే 15న రిలీజైన ఈ సినిమా ఇప్పటకే రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అంతేకాదు సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతకు ముందు స్టార్ హీరోస్ అజిత్, విజయ్ ల కెరీర్‌లోనేనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్‌లో త్రిషనే హీరోయిన్ గా చేసింది. విజయ్, త్రిషల కాంబినేషన్ లో వచ్చిన లియో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు విజయ్ కెరీర్ లోనే ఇదే బిగ్గెస్ట్ హిట్. అలాగే అజిత్, త్రిషలు హీరో, హీరోయిన్లుగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇది కూడా అజిత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు కరుప్పు కూడా సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో లాయర్‌గా ప్రీతి పాత్రలో త్రిష మెప్పించింది..
ఇప్పుడు ఇదే విషయాన్ని షేర్ చేస్తూ ఓ ఫ్యాన్ పోస్ట్ పెట్టింది. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ విజయం వెనుక త్రిష మ్యాజిక్ ఉందని రాసుకొచ్చింది. అంతేకాకుండా ఆ మూడు చిత్రాల్లోనూ త్రిష నలుపు దుస్తులు ధరించారని, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందుకేనేమో ఆ మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించి ఉంటాయని తెలిపింది. ఈ పోస్ట్ త్రిష వరకు చేరింది. దీనిని చూసి న త్రిష ఎంతగానో సంతోషించింది. సదరు అభిమానికి ధన్యవాదాలు అని చెబుతూ చిరునవ్వుతో కూడిన పలు ఎమోజీలను ఎక్స్ మీడి యాలో పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కాగా త్రిష ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభరలో నటిస్తోంది. వశిష్ట తెరకెక్కస్తోన్ ఈ సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ కూడా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది .త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
త్రిష బ్లాక్ డ్రెస్ ధరిస్తే సినిమా హిట్టే..
#Trisha insta stories #Leo #Vijay #GoodBadUgly #ajithkumar #Karuppu #Suriya pic.twitter.com/j8RYWtJmbn
— Shameena (@shameena_111) May 24, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
