AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karuppu OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి సూర్య-త్రిషల బ్లాక్ బస్టర్.. ‘కరుప్పు’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా కరుప్పు. తెలుగులో వీరభద్రుడిగా రిలీజైంది. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ లో త్రిష హీరోయిన్ గా నటించింది. మే 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

Karuppu OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి సూర్య-త్రిషల బ్లాక్ బస్టర్.. 'కరుప్పు' స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Karuppu Movie
Basha Shek
|

Updated on: Jun 08, 2026 | 10:26 AM

Share

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చాలా రోజుల తర్వాత కరుప్పు సినిమా రూపంలో ఓ మంచి సూపర్ హిట్ అందుకున్నాడు. మే 15న తమిళంతో పాటు తెలుగు (వీరభద్రుడు) భాషల్లో రిలీజైన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ తమిళనాడులో చాలా చోట్ల ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. అదే సమయంలో చాలా మంది సూర్య సినిమాను ఓటీటీలో చూడాలని ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కరుప్పు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 12 నుంచి కరుప్పు సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు తాజాగా అమెజాన్‌ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటిస్తూ యాప్‌లో అప్‌డేట్‌ చేసింది. కాగా ‘కరుప్పు’ సినిమా థియేటర్లలో తమిళం, తెలుగు భాషల్లో మాత్రమే విడుదలైంది. అయితే ఓటీటీలో మాత్రం తెలుగు, తమిళంతో పాటు హిందీ తదితర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

డ్రీమ్ వారియర్ బ్యానర్ పై ఆర్జే బాలాజీ కరుప్పు సినిమాను తెరకెక్కించారు. సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్‌గా నటించింది. విలన్ గా ఆర్జే బాలాజీనే యాక్ట్ చేయడం విశేషం. ఇంద్రాన్స్, అనాఘా, మన్సూర్ అలీఖాన్, జార్జి మరియన్, ఆడుకలం నరేన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సాయి అభ్యంకర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో సూర్య కరుప్పు సినిమాను మిస్ అయ్యారా? లేదా మరోసారి చూడాలనుకుంటున్నారా? అయితే మూడు రోజులు ఆగండి.. ఎంచెక్కా ఇంట్లోనే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూర్య-త్రిషల కరుప్పు సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ట్రైనీ IPS కేసు.. మాజీ CBI డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రైనీ IPS కేసు.. మాజీ CBI డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
లెక్కలేసుకుని డైరెక్టర్లుగా మారుతున్న యంగ్ హీరోలు
లెక్కలేసుకుని డైరెక్టర్లుగా మారుతున్న యంగ్ హీరోలు
రామాయణ భూమిలో తవ్వకాలు.. 35 రావణుడి విగ్రహాల వెలికితీత.. సంచలనం!
రామాయణ భూమిలో తవ్వకాలు.. 35 రావణుడి విగ్రహాల వెలికితీత.. సంచలనం!
పైసా ఖర్చు లేకుండా కంటి మసక సమస్యలు ఇలా తరిమికొట్టండి
పైసా ఖర్చు లేకుండా కంటి మసక సమస్యలు ఇలా తరిమికొట్టండి
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట
కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?
కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?
ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చేసే ఈ తప్పులతో జాగ్రత్త!
ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చేసే ఈ తప్పులతో జాగ్రత్త!
మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం
మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం
పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!
పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!
మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..
మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..