AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha: త్రిష డిప్యూటీ సీఎం అవుతారా..? మాజీ మంత్రి సంచలన కామెంట్స్..

తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిష పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సీఎం విజయ్ తన సినీ స్నేహితులకు కీలక పదవులు ఇస్తున్నారని విమర్శించిన అన్నాడీఎంకే మాజీ మంత్రి ఉదయకుమార్.. ఇదే పరిస్థితి కొనసాగితే రేపు త్రిషను డిప్యూటీ సీఎంగా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ రాజకీయ సెటైర్ విసిరారు. ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

Trisha: త్రిష డిప్యూటీ సీఎం అవుతారా..? మాజీ మంత్రి సంచలన కామెంట్స్..
Trisha Deputy Cm
Shaik Madar Saheb
|

Updated on: Jun 28, 2026 | 8:56 PM

Share

ఎంతైనా అది తమిళనాడు కదా. అక్కడ ఏదైనా సాధ్యమే! నిన్న మొన్నటి వరకు వెండితెరపై దళపతి విజయ్ పక్కన డ్యూయెట్లు పాడిన త్రిష.. త్వరలోనే డిప్యూటీ సీఎం సీట్లో కూర్చోబోతున్నారట. సీఎం విజయ్ పక్కన అధికారికంగా కొలువుదీరబోతున్నారట. ఏమో గుర్రం ఎగరావచ్చు! రేప్పొద్దున తమిళనాడు సెక్రటేరియట్‌లో దళపతి విజయ్ పక్కన.. నటి త్రిష డిప్యూటీ సీఎంగా కూర్చున్నా కూర్చోవచ్చు! ఈ ఊహాగానాలు చేస్తున్నది మరెవరో కాదు ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ నేతనే.

మొన్నీమధ్య ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధిగా కర్నాటకకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట నారాయణను సీఎం విజయ్ నియమించారు. విజయ్ సినిమా జన నాయగన్‌ను నిర్మించినందుకే, పక్క రాష్ట్ర పౌరుడికి తమిళనాడు తరఫున అత్యంత కీలకమైన నామినేటెడ్ పోస్ట్ కట్టబెట్టారంటూ పెద్ద ఎత్తున వివాదం రాజుకుంది. 8 కోట్ల మంది ఉన్న తమిళనాడులో ఢిల్లీకి పంపడానికి ఒక్క తమిళుడు కూడా దొరకలేదా అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

దీన్ని టార్గెట్ చేస్తూ అన్నాడీఎంకే మాజీ మంత్రి ఉదయకుమార్ ఓ కామెంట్ చేశారు. సీం విజయ్ కేవలం తన స్నేహాలకు, సినీ బాంధవ్యాలకే ప్రభుత్వ ఉద్యోగాలు, పెద్ద పెద్ద పదవులు కట్టబెడుతున్నారు, ఇదే పద్ధతి కొనసాగితే.. రాబోయే రోజుల్లో మేడం త్రిషను ఉపముఖ్యమంత్రి చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

ముఖ్యమంత్రి విజయ్ పరిపాలనను, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను ఎండగట్టే క్రమంలో.. ప్రతిపక్షాలు ఏకంగా విజయ్ క్రేజీ కాంబినేషన్ అయిన త్రిష పేరును తెరపైకి తెచ్చాయి. స్నేహాల కోసమే పదవులు ఇస్తుంటే.. రేపు త్రిషకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఇస్తారంటూ ఉదయ్ కుమార్ చేసిన పొలిటికల్ సెటైర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది. అన్నాడీఎంకే చేసిన ఈ ‘డిప్యూటీ సీఎం త్రిష’ కామెంట్స్‌పై అటు విజయ్ పార్టీ టీవీకే శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.

వీడియో చూడండి..

Follow Us
రెండు చేతుల్లో ఆ గుర్తు ఉంటే తిరుగులేని ధనయోగం.. ఎందుకో తెలుసా?
రెండు చేతుల్లో ఆ గుర్తు ఉంటే తిరుగులేని ధనయోగం.. ఎందుకో తెలుసా?
 మీ ఇంట్లో వాడుతున్న స్క్రబ్బర్ సురక్షితమేనా?.. షాకింగ్ రిపోర్ట్!
 మీ ఇంట్లో వాడుతున్న స్క్రబ్బర్ సురక్షితమేనా?.. షాకింగ్ రిపోర్ట్!
డూప్ లేకుండా ఆ సీన్ చేశాడు..
డూప్ లేకుండా ఆ సీన్ చేశాడు..
మీ పొట్ట ఐసు గడ్డలా కరగాలి అంటే ఈ సీక్రెట్ డ్రింక్ తాగండి
మీ పొట్ట ఐసు గడ్డలా కరగాలి అంటే ఈ సీక్రెట్ డ్రింక్ తాగండి
వీటిని సరైన విధంగా తింటున్నారా? ఇలా తింటేనే పూర్తి ప్రయోజనం
వీటిని సరైన విధంగా తింటున్నారా? ఇలా తింటేనే పూర్తి ప్రయోజనం
పెళ్లి రోజు వాన పడితే ఆ దంపతుల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా?
పెళ్లి రోజు వాన పడితే ఆ దంపతుల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా?
చిక్కటి గ్రేవీతో నోరూరించే మటన్ పాయ.. అస్సలు తినాల్సింది ఇప్పుడే
చిక్కటి గ్రేవీతో నోరూరించే మటన్ పాయ.. అస్సలు తినాల్సింది ఇప్పుడే
ఇంట్లోనే టేస్టీ టేస్టీ పిజ్జా సాస్.. ఎలా తయారు చేయాలో తెలుసా?
ఇంట్లోనే టేస్టీ టేస్టీ పిజ్జా సాస్.. ఎలా తయారు చేయాలో తెలుసా?
కేవలం నీటితో కడిగితే సరిపోదు..పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయండి
కేవలం నీటితో కడిగితే సరిపోదు..పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయండి
బిర్యానీ, పులావ్‌ల్లోకి అదిరిపోయే హైదరాబాదీ దాల్చా..
బిర్యానీ, పులావ్‌ల్లోకి అదిరిపోయే హైదరాబాదీ దాల్చా..