AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలాంటి హీరోయిన్‌ను నేను ఎప్పుడూ చూడలేదు.. సినిమాలో తీసుకోలేదని అలిగింది

మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో “సంక్రాంతి రాజు” గా పేరొందిన మెగా మేకర్ ఎం. ఎస్. రాజు దర్శకుడిగానూ ప్రతిభ చాటుతున్నారు. పలు సినిమాలు దర్శకత్వం వహించి ప్రేక్షకులను మెప్పించారు ఎమ్ ఎస్ రాజు.

అలాంటి హీరోయిన్‌ను నేను ఎప్పుడూ చూడలేదు.. సినిమాలో తీసుకోలేదని అలిగింది
Ms Raju
Rajeev Rayala
|

Updated on: Jul 04, 2026 | 6:14 PM

Share

ప్రముఖ సినీ నిర్మాత ఎమ్.ఎస్. రాజు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో కీలకమైన వ్యక్తుల గురించి అలాగే హీరోయిన్ త్రిష కృష్ణన్, దివంగత నటుడు శ్రీహరి, దివంగత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిలతో తనకున్న అద్భుతమైన అనుబంధాలను పంచుకున్నారు. త్రిషతో తన ప్రయాణం గురించి ఎమ్.ఎస్. రాజు మాట్లాడుతూ, ఆమె తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని అన్నారు. వర్షం సినిమాకు ముందు త్రిషను అర్జున్ చిత్రం కోసం అనుకున్నాం, ఆ అమ్మాయి క్యారెక్టర్‌కు సెట్ అవ్వదనే అనుకున్నాం. అయితే, మహేష్ బాబు వద్ద ఉన్న త్రిష ఫోటోలను చూసిన ఎమ్.ఎస్. రాజు, ఆమె ముఖంలో ఏదో ప్రత్యేకతను గుర్తించారు. దర్శకుడు మొదట అంగీకరించకపోయినా, ఎమ్.ఎస్. రాజు పట్టుబట్టి త్రిషను ఆడిషన్ చేయించారట. ఆమెను కలిసినప్పుడు, చిన్న టమ్మీ ఉండటం గమనించి, వ్యాయామం చేయమని సూచించగా, వెంటనే ఆమె మదర్ ఉమ, “అయితే మీరు సినిమా త్రిషను తీసుకుంటున్నారా ” అని అడిగారు. అక్కడి నుంచి త్రిష వెనక్కి తిరిగి చూడలేదని ఎమ్.ఎస్. రాజు తెలిపారు.

ఇది కూడా చదవండి : Hema : అమ్మబాబోయ్.. హేమ కూతుర్ని చూశారా..!! స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

త్రిష డేట్ల విషయంలో చూపిన అంకితభావం అద్భుతమని ఆయన కొనియాడారు. సాధారణంగా హీరోయిన్లు డైరీ చూసి డేట్లు ఇస్తుంటారు లేదా లేదని చెప్తారు. కానీ త్రిష మాత్రం తన డైరీని ఎమ్.ఎస్. రాజు చేతికి ఇచ్చి, “మీకు ఎప్పుడు కావాలో అప్పుడు రాసుకోండి, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను” అని చెప్పేవారట. వర్షం చిత్రంలో 75 రోజులు వర్షంలో తడవడం వంటి కఠినమైన సన్నివేశాల్లోనూ త్రిష ఎంతో సహకారం అందించారని, నా వల్ల కాదు అని ఏడ్చిన సందర్భాలు ఉన్నా, చివరికి నిలబడి పనిచేసిందని ఎమ్.ఎస్. రాజు గుర్తుచేసుకున్నారు. ఎమ్.ఎస్. రాజు సినిమాలంటే త్రిషకు అమితమైన గౌరవం ఉండేదని, కథ వినాల్సిన అవసరం కూడా లేదని, స్పాట్‌లో సీన్ చెప్పగానే చేసేదని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Pawan Kalyan: డిజాస్టర్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్

నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి ఆమెను అనుకోకపోయినా, స్వయంగా వచ్చి డేట్లను ఇచ్చి వెళ్లిపోయిందని, అది ఆమె నమ్మకానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఒక ఇంగ్లీష్ పత్రిక “రాత్రి మూడు గంటలకి ఎవరితో మాట్లాడటానికి కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు.?” అని అడిగినప్పుడు, త్రిష ఓన్లీ ఎమ్.ఎస్. రాజు అని చెప్పడం ఆమెకు తనపై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుందని ఆయన సంతోషంగా పంచుకున్నారు. ఆటా సినిమాకు ఇలియానాని తీసుకున్నప్పుడు త్రిష అలిగి, షూటింగ్‌కి వస్తానని చెప్పిందని, ఇది తమ మధ్య ఉన్న కుటుంబ అనుబంధాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us