AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Movie: ఫ్యాన్స్ గెట్ రెడీ.. యశ్ ‘టాక్సిక్’ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?

రాకింగ్ స్టార్ యష్ నటించిన 'టాక్సిక్' సినిమాను చూసేందుకు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ తేదీకి సంబంధించి ముఖ్యమైన సమాచారం వచ్చింది. కన్నడ, తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఒకేసారి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కానుంది.

Toxic Movie: ఫ్యాన్స్ గెట్ రెడీ.. యశ్ 'టాక్సిక్' మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Toxic Movie
Basha Shek
|

Updated on: Aug 18, 2026 | 10:00 PM

Share

రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది . గ్యాంగ్‌స్టర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఈ సినిమాను చూసేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాక్సిక్ సినిమా రిలీజ్ కు సంబంధించి ఒక పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి అన్ని భాషల్లోనూ బుకింగ్‌లు ప్రారంభమవుతాయని సినిమా వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఈ విషయంపై టాక్సిక్ దర్శక నిర్మాతలు ఒక అధికారిక ప్రకటన చేయనున్నారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ‘టాక్సిక్’ సినిమాలో భారీ తారాగణం ఉంది. హీరో యశ్ సరసన కియారా అద్వానీ ప్రధాన కథానాయికగా జత కట్టింది. అలాగే నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి అందాల తారలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ సహా పలువురు విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్‌స్టర్ మైండ్స్ సంస్థలు సంయుక్తంగా టాక్సిక్ చిత్రాన్ని నిర్మించాయి. రవి బస్రూర్, తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. కొన్ని పాటలకు విశాల్ కూడా సంగీతం అందించారు.. ఇక ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన కంటెంట్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ముఖ్యంగా ఇటీవల రిలీజైన టాక్సిక్ ట్రైలర్ కు యూట్యూబ్ లో సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా నేషనల్ మీడియా ఛానెళ్లకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు యశ్. తద్వారా తన సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకువెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక టాక్సిక్ సినిమాలో యశ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండడం మరింత ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

టాక్సిక్ సినిమాలో యశ్, కియారా అద్వానీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!