AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కంటిచూపుతోనే ఆడియెన్స్‌ను భయపెట్టాడు.. ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? పాపం షూటింగులోనే..

సిల్వర్ స్క్రీన్ పై ఈ నటుడు కనిపిస్తేనే ఆడియెన్స్ భయపడిపోయేవారు. ఈ నటుడి రూపం, మరీ ముఖ్యంగా కళ్లు ఇతనిని ప్రత్యేకంగా నిలిపాయి. మెగాస్టార్ చిరంజీవి మొదలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో ఈ నటుడు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు.

Tollywood: కంటిచూపుతోనే ఆడియెన్స్‌ను భయపెట్టాడు.. ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? పాపం షూటింగులోనే..
Tollywood Actor Konchada Srinivas
Basha Shek
|

Updated on: Aug 17, 2026 | 9:32 PM

Share

కొంచాడ శ్రీనివాస్‌.. ఇలా పేరు చెబితే చాలా మంది ఈ టాలీవుడ్ నటుడిని గుర్తు పట్టకోవచ్చు కానీ.. పై ఫొటో చూస్తే ఇట్టే గుర్తు పడతారు. శ్రీకాకుళంకు చెందిన ఈ నటుడు పలు తెలుగు సినిమాల్లో నటించారు. అలాగే దాదాపు పది సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు. ఈ నటుడు స్పెషాలిటీ ఏంటంటే.. సినిమాల్లో ఈ యాక్టర్ కు పెద్దగా డైలాగులుండవు. అయినా తన కంటి చూపతోనే ఆడియెన్స్ ను భయపెట్టాడు. కొంచాడ శ్రీనివాస్ రూపం, గుబురు జుట్టు ముఖ్యంగా కళ్లు ఆయనను అందరి మధ్య ప్రత్యేకంగా నిలిపాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా ‘శంకర్ దాదా ఎంబీబీస్’ లో ఓ కీలక పాత్ర పోషించారు కొంచాడ. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆది’లోనూ నటించారు. యంగ్ హీరో ఆది సాయి కుమార్ ‘ప్రేమ కావాలి’ చిన్నా ఆ ఇంట్లో, తనీశ్ నచ్చావులే తదితర సినిమాల్లో కొంచాడ శ్రీనివాస్ చేసిన పాత్రలు బాగా హైలెట్ గా నిలిచాయి. ఓవరాల్ గా దాదాపు 40 సినిమాల్లో నటించారు కొంచాడ. అలాే దాదాపు 10కి పైగా సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు.

కాగా తెలుగు సినిమాల్లో సహాయక నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కొంచాడ శ్రీనివాస్. అయితే నటుడిగా బిజీగా ఉన్న సమయంలోనే ఆయన కన్నుమూశారు. అది కూడా 47 ఏళ్ల వయసులోనే. ఓ సినిమా షూటింగ్‌ సమయంలో కింద పడిపోవడంతో శ్రీనివాస్‌కు ఛాతీపై దెబ్బ తగిలిందట. దీంతో అప్పటి నుంచే ఆయనకు గుండె సమస్యలు తలెత్తాయట. ఇక ప్రతి సంక్రాంతికి సొంత ఊరు వెళ్లడం కొంచాడకు అలవాటు. అలా 2022లో కూడా సంక్రాంతి పండగ కోసం శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని కాశీబుగ్గ పట్టణానికి వెళ్లాడు. అయితే అక్కడే ఆయనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ప్రయోజనం లేకుండా పోయింది. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ కొంచాడ కన్నుమూశారు.

కాగా కొంచాడ శ్రీనివాస్‌ పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది. చనిపోయేంతవరకు అమ్మ తోనే కలిసి ఉన్నారు. కాగా కొంచాడ శ్రీనివాస్ చనిపోవడానికి పదేళ్ల క్రితమే ఆయన తమ్ముడు మరణించాడు. ఇక కొంచాడకు ఇద్దరు అక్కచెల్లెళ్లు. వారికి పెళ్లిళ్లు అయిపోయి అత్తారిళ్లల్లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..