AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash- Rashmika: ఆమె వ్యాఖ్యలు నా వ్యక్తిత్వాన్ని మార్చలేవు.. రష్మిక కామెంట్స్‌పై స్పందించిన ‘టాక్సిక్’ హీరో

కొన్ని సంవత్సరాల క్రితం యశ్ ను ఉద్దేశిస్తూ రష్మిక మందన్న చేసిన వ్యాఖ్య లు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. అప్పట్లో యశ్ అభిమానులు కూడా రష్మిక కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇన్నేళ్ల తర్వాత యశ్ రష్మిక కామెంట్స్ పై తన మౌనాన్ని వీడాడు.

Yash- Rashmika: ఆమె వ్యాఖ్యలు నా వ్యక్తిత్వాన్ని మార్చలేవు.. రష్మిక కామెంట్స్‌పై స్పందించిన 'టాక్సిక్' హీరో
Yash, Rashmika
Basha Shek
| Edited By: |

Updated on: Aug 17, 2026 | 10:21 AM

Share

కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన రష్మిక మందన్నా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయిపోయింది. నేషనల్ క్రష్ గా అందరి మన్ననలు అందుకుంటోంది. అయితే గతంలో రాకింగ్ స్టార్ యశ్‌ను ‘మిస్టర్ షో -ఆఫ్’ అని పిలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. 2016లో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. ఇదే క్రమంలో హీరో యశ్ పై కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుంది రష్మిక. యశ్ అభిమానులు కూడా రష్మికపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయం తీవ్రరూపం దాల్చడంతో, రష్మిక బహిరంగంగా క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే తనపై రష్మిక చేసిన కామెంట్స్ పై ఇప్పటివరకు స్పందించలేదు యశ్. అయితే తాజాగా టాక్సిక్ ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోన్న రాకింగ్ స్టార్ రష్మిక కామెంట్స్ పై స్పందించాడు. ‘మా గురించి ఎవరైనా అభిప్రాయం చెప్పవచ్చు. కానీ ఒకరి అభిప్రాయం నా వ్యక్తిత్వాన్ని నిర్ణయించలేదు. నేను ఎలా ఉన్నా, ఇతరుల దృక్కోణం వల్ల అది మారదు. ఆమె ఏ ఉద్దేశంతో అలా అన్నారో నాకు తెలియదు. అప్పట్లో తను సినిమా ఇండస్ట్రీకి కొత్త. కొన్ని టీవీ షోలలో యాంకర్లు 3-4 ఆప్షన్లు ఇచ్చి ఏదో ఒకటి ఎంచుకోమంటారు. ఆ ఆప్షన్లలో నాకు ఇది సరిపోతుందని రష్మిక భావించి ఉండొచ్చు. నేను మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఎవరి అభిప్రాయం వాళ్లది’ అని యశ్ చెప్పుకొచ్చారు.

కాగా రష్మిక కామెంట్స్ తర్వాత యష్ అభిమానులు సోషల్ మీడియాలో ఆమెను బాగా ట్రోల్ చేశారు. దీనిపై కూడా స్పందిచిన రాకింగ్ స్టార్ ఫ్యాన్స్ కు ఒక మంచి సందేశం ఇచ్చాడు. ‘మీరు మరో నటుడిని లేదా నటిని గౌరవించకపోతే, మీరు నా అభిమాని కాలేరు’ అని చెప్పుకొచ్చారు టాక్సిక్ హీరో. ఇక ‘టాక్సిక్’ సినిమా విషయానికి వస్తే.. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది. ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఇందులో యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేవీఎన్ యష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక టాక్సిక్’ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. ఆ రెండు పాటలూ హిట్టయ్యాయి. ముఖ్యంగా యష్, కియారాలు నటించిన ‘తబాహి’ పాట పెద్ద హిట్టయింది. ఈ సినిమాకు రవి బస్రూర్ నేపథ్య సంగీతం అందించగా, విశాల్ మిశ్రా కొన్ని పాటలకు సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us