Prabhas: ఏడేళ్ల తర్వాత ఇన్‌స్టా డీపీ మార్చేసిన ప్రభాస్.. కారణమేమిటంటే?
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు డార్లింగ్ ఏ చిన్న పని చేసినా నెట్టింట ఇట్టే వైరల్ అయిపోతుంది. తాజాగా ప్రభాస్ తన ఇన్ స్టా గ్రామ్ డీపీని మార్చేయడం ఆసక్తికరంగా మారింది.

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. ‘ఫౌజీ’, స్పిరిట్’, ‘సలార్ 2’, ‘కల్కి2’.. ఇలా చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు ప్రభాస్. వీటిలో ఫౌజీ సినిమా మొదట రిలీజ్ కానుంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాడి డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కూడా ఎక్కువే. ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ (ఎక్స్) లలో ఎన్నో కోట్ల మంది అభిమానులు డార్లింగ్ ను ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో ప్రభాస్ 13.8 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇన్ స్టాలో ఇన్నాళ్లూ ‘ బాహుబలి’ చిత్రంలోని ఫొటోనే డీపీ (ప్రొఫైల్ ఫొటో) గా ఉంచాడు. అయితే సుమారు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఉన్నట్లుండి తన డీపీని మార్చేశారు ప్రభాస్. ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ ఫౌజీ చిత్రంలోని కొత్త స్టిల్ ను ప్రొఫెల్ ఫొటోగా మార్చారు డార్లింగ్. దీంతో ఇప్పుడీ విషయం నెట్టింట వైరల్ గా మారింది.
బాహుబలి తర్వాత ప్రభాస్ చాలా సినిమాల్లో నటించారు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి.. ఇలా ఎన్నో క్రేజీ ప్రాజెక్టుల్లో హీరోగా చేశారు. అయితే ఏ సినిమా కోసం కూడా డీపీని మార్చలేదు. ఇప్పుడు మాత్రం ‘ఫౌజీ’ చిత్రంలోని స్టిల్‌ను పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాపై డార్లింగ్ కు ఉన్న గట్టి నమ్మకమేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఫీల్ గుడ్ డైరెక్టర్ గా పేరొందిన హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సీనియర్ హీరోయిన్ జయప్రద మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి బాలీవుడ్ స్టార్స్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ అభిమానులకు తెగ నచ్చేసింది. తాజాగా ప్రభాస్ సైతం ఫౌజీ స్టిల్ ను డీపీ గా మార్చుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఫౌజీ సినిమా డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇన్ స్టా డీపీగా ఫౌజీ రీసెంట్ స్టిల్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




