AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో హిస్టరీ క్రియేట్ చేసిన తెలుగు సినిమా.. ఒక వారంలోనే 200 మిలియన్స్ కు పైగా వ్యూస్‌తో..

థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా గత వారమే ఓటీటీలోకి వచ్చేసింది. సిల్వర్ స్క్రీన్ పై కాసుల వర్షం కురిపించిన ఈ రివేంజ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లోనూ రికార్డులు కొల్లగొడుతోంది. కేవలం ఒక వారంలోనే 200 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ ను నమోదు చేసి ఓటీటీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందీ మూవీ.

OTT Movie: ఓటీటీలో హిస్టరీ క్రియేట్ చేసిన తెలుగు సినిమా.. ఒక వారంలోనే 200 మిలియన్స్ కు పైగా వ్యూస్‌తో..
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 13, 2026 | 9:20 PM

Share

బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేవలం ఒక్క వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేయటం విశేషం. ఈ ఘనత సినిమాకు ఓ చారిత్రాత్మక స్ట్రీమింగ్ మైల్‌స్టోన్‌గా నిలిచింది. థియేట్రిక‌ల్‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ‘లెనిన్’పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి, సినిమాను చూసేందుకు కొనసాగుతున్న ఉత్సాహానికి ఇదొక ఉదార‌ణ‌. మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత జూలై 10న థియేటర్లలో విడుదలైన ‘లెనిన్’ సినిమా ఆయన కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌ను సాధించింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రూ.100 కోట్ల వ‌సూళ్ల‌తో లాభాల బాట ప‌ట్టిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన మంచి స్పందన కొన‌సాగుతోంది. అదే ఆదరణతో ‘లెనిన్’ మంచి కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’లో యాక్షన్, ప్రేమ, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు పల్లెటూరి నేపథ్యం ప్రధానంగా కనిపిస్తుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో పాత్రల మధ్య సంఘర్షణ, వ్యక్తిగత సంబంధాలు, దాగి ఉన్న రహస్యాలు, ఉత్కంఠభరితమైన స‌న్నివేశాల‌ను ఆస‌క్తిక‌రంగా కథను ముందుకు నడిపించాయి. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా..ప్ర‌మోద్ పంజు, రాంకీ, ఈశ్వ‌రీరావు, శివాజీ, బ్ర‌హ్మాజీ, సునీల్ త‌దిత‌రులు ఇత‌ర‌ కీలక పాత్రల్లో కనిపించి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించారు.

అఖిల్ అక్కినేనికి ‘లెనిన్’ ఓ సినిమా మాత్రమే కాదు. సినిమాలకు సుదీర్ఘ విరామం తర్వాత ఆయన కెరీర్‌లో కీలక సమయంలో ఈ చిత్రం విడుద‌లైంది. థియేటర్లలో సాధించిన విజయంతో అఖిల్ కెరీర్‌లోనే కొత్త కమర్షియల్ హైను మూవీ అందుకుంది. ఇప్పుడు థియేటర్ల నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ వరకు ‘లెనిన్’ ప్రయాణం కొనసాగుతోంది. తెలుగు ZEE 5లోనూ ప్రేక్షకులు ఈ సినిమాను ఆసక్తిగా చూస్తుండటంతో, దాని విజయవంతమైన జోరు మరింత ముందుకు సాగుతోంది. జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభ‌మైన ఒక వారంలోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేయడం విశేషం. ఎందుకంటే ఇది సినిమాను ఎంతమంది ప్రేక్షకులు ప్లే చేశారనే సంఖ్యను మాత్రమే కాకుండా, వారు సినిమాను ఎంతసేపు ఆసక్తిగా చూశార‌నే విష‌యాన్ని కూడా తెలియజేస్తుంది. థియేటర్లలో సినిమాను చూసిన ప్రేక్షకుల నుంచి ఇప్పుడు ఇంటి నుంచే ‘లెనిన్’ను కొత్తగా చూస్తున్న వారి వరకు.. స్ట్రీమింగ్‌లో ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తోంది.

ఇవి కూడా చదవండి

జీ5 ఓటీటీలో లెనిన్ సినిమా సంచలనం..

అఖిల్ అక్కినేని వెర్స‌టైల్, ప‌వ‌ర్‌ఫుల్ యాక్టింగ్‌, డైరెక్ట‌ర్ మురళీ కిశోర్ అబ్బూరు క‌థ‌, క‌థ‌నం, నేచుర‌ల్ టేకింగ్‌, థమన్ అందించిన ప్రభావవంతమైన సంగీతం, భావోద్వేగాలతో కూడిన గ్రామీణ యాక్షన్ నేపథ్యంతో ‘లెనిన్’ ఇప్పుడు వెండితెర నుంచి తెలుగు ప్రేక్షకుల ఇళ్లలోకి అడుగుపెట్టి విజ‌య‌వంతంగా ఆద‌ర‌ణ‌ను పొందుతోంది. దీంతో కేవలం ఏడు రోజుల్లోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసిన ‘లెనిన్’..తెలుగు ZEE5లో అధికారికంగా చరిత్ర సృష్టించింది.

లెనిన్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈ నెలంతా వారికి లక్ష్మీ కటాక్షం..ఆకస్మిక ధన లాభానికి ఛాన్స్..!
ఈ నెలంతా వారికి లక్ష్మీ కటాక్షం..ఆకస్మిక ధన లాభానికి ఛాన్స్..!
ఈ పాటలో ఇంత అర్ధం ఉందా.. ఏశనాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్
ఈ పాటలో ఇంత అర్ధం ఉందా.. ఏశనాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్
‘సారీ రాధికా.. గుడ్‌బై’.. భార్య బర్త్‌డే నాడే టెకీ ఆత్మహత్య
‘సారీ రాధికా.. గుడ్‌బై’.. భార్య బర్త్‌డే నాడే టెకీ ఆత్మహత్య
విమర్శలు చూసి తట్టుకోలేక భారత్ పేరు లాగిన పీసీబీ చీఫ్
విమర్శలు చూసి తట్టుకోలేక భారత్ పేరు లాగిన పీసీబీ చీఫ్
ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం..
ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం..
డాబాపై చిన్నారి ఏడుపు.. వెళ్లి చూడగా షాక్! ఫోన్‌లో మాట్లాడుతూనే..
డాబాపై చిన్నారి ఏడుపు.. వెళ్లి చూడగా షాక్! ఫోన్‌లో మాట్లాడుతూనే..
అదుపు తప్పి బావి వైపు కెళ్లిన ఆర్టీసీ బస్సు.. 54 మంది ప్రయాణికులు
అదుపు తప్పి బావి వైపు కెళ్లిన ఆర్టీసీ బస్సు.. 54 మంది ప్రయాణికులు
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
మా దుస్థితికి బాధ్యులు మీరే.. ఆ.. దేశాలపై నేపాల్‌ ఫైర్ !
మా దుస్థితికి బాధ్యులు మీరే.. ఆ.. దేశాలపై నేపాల్‌ ఫైర్ !