AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి మలయాళం బ్లాక్ బస్టర్.. మనీ హీస్ట్ లాంటి క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

ఇంగ్లిష్ లో వచ్చిన మనీ హీస్ట్ వెబ్ సిరీస్ ను చాలా మంది చూసే ఉంటారు. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి మనీ హీస్ట్ స్టోరీతోనే ఈ మలయాళం సినిమా తెరకెక్కింది.

OTT Movie: ఓటీటీలోకి మలయాళం బ్లాక్ బస్టర్.. మనీ హీస్ట్ లాంటి క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 14, 2026 | 9:08 PM

Share

మలయాళం సినిమాలకు ఓటీటీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ సస్పెన్స్, క్రైమ్, హారర్, థ్రిల్లర్ సినిమాలనైతే విడిచి పెట్టకుండా చూసేస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమానే. ఇటీవల ఈ మూవీ థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు సాలిడ్ కలెక్షన్లు రావడం విశేషం. ఇప్పుడీ సినిమా ఒకేసారి మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కు రానుంది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఐ నోబడీ’. ‘రోర్‌షాక్’, ‘కెట్టియోలాను ఎంతె మాలాఖ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు నిజామ్ బషీర్ ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు. సస్పెన్స్, ఎమోషన్స్, క్రైమ్, మిస్టరీ, ఫ్యామిలీ డ్రామా, పొలిటికల్ సెటైర్.. ఇలా అన్నీ అంశాలను ఈ సినిమాలో సరిగ్గా చూపించారు.

‘ఐ నోబడీ’ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన పార్వతీ తిరువోతు కథానాయికగా చేసింది. వీరితో పాటు హకీమ్ షాజహాన్, అశోకన్, విజయ రాఘవన్, మధుపాల్, శంకర్ రామకృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 20 నుంచి ఐ నోబడీ సినిమా స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ వంటి 5 భాషల్లో ఒకేసారి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఐ నో బడీ సినిమా..

పృథ్వీరాజ్ సుకుమారన్ ఐ నో బడీ సినిమా ట్రైలర్ తెలుగులో…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us