AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫస్ట్ సినిమా రాకముందే.. హీరోయిన్ల జోరు నెక్స్ట్ లెవల్

ఫస్ట్ సినిమా రాకముందే.. హీరోయిన్ల జోరు నెక్స్ట్ లెవల్

Samatha J
|

Updated on: Sep 28, 2026 | 3:40 PM

Share

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల శకం మొదలవుతోంది. రుక్మిణి వసంత్, ఇమాన్వి ఇస్మాయిల్, తృప్తి డిమ్రి లాంటి నటీమణులు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి బడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. పాత తరం హీరోయిన్లు పక్కకు జరుగుతుండగా, ఈ కొత్త తరం హీరోయిన్లు తమ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు.

టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత ఎప్పుడూ చర్చనీయాంశమే. ఒకప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోయిన పూజా హెగ్డే, రష్మిక మందన్న, శ్రీలీల వంటి అగ్రతారలు కొత్త తరం హీరోయిన్లకు మార్గం సుగమం చేస్తున్నారు. ఈ మార్పుతో టాలీవుడ్‌లో కొత్త నీరు వచ్చి చేరుతోంది. ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి బడా స్టార్ హీరోలతో అవకాశాలు దక్కించుకుంటున్న నాయికలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ క్రేజీ ఆఫర్లతో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంలో నటిస్తున్న రుక్మిణి, సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమాలో కూడా ఎంపికైనట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో క్యూట్ డ్యాన్స్ వీడియోలతో ఆకట్టుకున్న ఇమాన్వి ఇస్మాయిల్, ఎటువంటి సినీ నేపథ్యం లేకుండానే ప్రభాస్ ఫౌజీ చిత్రంలో అవకాశం దక్కించుకున్నారు. ఫౌజీ విడుదలకు ముందే ఇమాన్వి పేరు మార్మోగుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

గేమ్ షురూ.. అనిరుధ్‌కు కరెక్ట్ పోటీ అతడేనా..?

నాని ప్యారడైజ్ మూవీపై కేటీఆర్ కామెంట్స్..శంకరన్న పాత్ర గురించి ఏం చెప్పారంటే?

ఓటీటీ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఈ వారం రిలీజ్ అయ్యే సూపర్ మూవీస్ ఇవే

చిరంజీవి మామూలోడు కాదు.. అన్నీ గుర్తు పెట్టుకుంటున్నారు..!

Follow Us