ఆ హీరోయిన్ కోసం సూర్య 4 సంవత్సరాలు ఎదురుచూశాడు.. చివరకు..
Rajitha Chanti
Pic credit - Instagram
28 September 2026
తమిళ చిత్ర పరిశ్రమలోని ఆదర్శ దంపతులలో హీరో సూర్య, జ్యోతిక జంట ఒకటి. ఇటీవల వారి పెళ్లి జరిగి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇటీవల వారు తమ పెళ్లి ప్రమాణాలను తిరిగి పునరుద్ధరించుకుంటూ వేడుక చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ తెగ వైరల్ అయ్యాయి.
ఈ సందర్భంలో సూర్య తండ్రి, సీనియర్ నటుడు శివకుమార్ తన కోడలు జ్యోతిక , కుమారుడు సూర్యల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
సూర్యను వివాహం చేసుకున్న తర్వాత జ్యోతిక కావాలనుకుంటే తన సొంత ఊరైన ముంబైకి వెళ్లి స్థిరపడి ఉండవచ్చని, కానీ ఆమె అలా చేయలేదని శివకుమార్ తెలిపారు.
ముంబైకి చెందిన అమ్మాయి అయినా పెళ్లి తర్వాత ఏకంగా 18 ఏళ్ల పాటు తమతో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని నడిపించిందని ప్రశంసించారు.
సాధారణంగా కథానాయికలు పెళ్లి తర్వాత పిల్లల విషయంలో తొందరపడరని, కానీ జ్యోతిక ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి, వారి కోసం సినిమాలకు దూరమైందని అన్నారు.
సూర్య మొదట్లో ఏ అమ్మాయినీ ఇష్టపడలేదని, కానీ జ్యోతికను చూసిన తర్వాత ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడని శివకుమార్ చెప్పారు.
జ్యోతికను పెళ్లి చేసుకునేందుకు సూర్య దాదాపు నాలుగేళ్ల పాటు వేచి చూశారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సూర్య, జ్యోతిక ఇద్దరూ బిజీగా ఉంటున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్