AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆ హీరోయిన్ డెడికేషన్‌కి ఫిదా.. బంపర్ ఆఫర్ ఇచ్చిన త్రివిక్రమ్..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చాలా కాలం గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ఆదర్శ కుటుంబం. వెంకటేశ్ హీరోగా వస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. అక్టోబర్ 9న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ పై మంచి హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే.

Rajitha Chanti
|

Updated on: Sep 28, 2026 | 9:49 PM

Share
టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఆదర్శ కుటుంబం' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని ఒక ప్రత్యేక గీతం,  అందులో నటి డింపుల్ హయతి చూపిన అంకితభావం ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

1 / 5
ఈ చిత్రంలో రూపొందించిన 'నారాయణమ్మ' అనే ఫోక్-బీట్ సాంగ్ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలవబోతుందని తెలుస్తోంది. ఈ పాటలో డింపుల్ హయతి తన అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్‌తో, ఎనర్జిటిక్ స్టెప్పులతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే, ఈ పాట షూటింగ్ సమయంలో డింపుల్ పడ్డ కష్టం, ఆమె చూపిన డెడికేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

2 / 5
ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఏమాత్రం అలసిపోకుండా సాంగ్ పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు ఆమె రిహార్సల్స్ చేశారట. తాజాగా నారాయణమ్మ సాంగ్ రిలీజ్ వేడుకలో ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ డింపుల్ హయతి పనితీరును, అంకితభావాన్ని కొనియాడారు. డింపుల్ హయతి పడిన కష్టాన్ని, ఆమె నటనపై చూపిన శ్రద్ధను చూసి మురిసిపోయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు

3 / 5
ఒక ఆర్టిస్ట్‌గా పాత్రకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ పాటే నిదర్శనమంటూ ఆమెను అభినందించారు. అంతేకాకుండా, భవిష్యత్తులో తన దర్శకత్వంలో వచ్చే ప్రాజెక్ట్‌లలోనూ ఆమెకు మంచి అవకాశాలు ఇస్తానని పరోక్షంగా చెప్పారు. ఆమెను పాటలో కాకుండా సినిమాలోనే కావాలనుకుంటున్నాను అని చెబుతూ తనకు సినిమా ఛాన్స్ ఇచ్చినట్లు చెప్పకనే చెప్పారు అని ఒకరకంగా ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

4 / 5
వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ సెంటిమెంట్, మాస్ ఎలిమెంట్స్ , డింపుల్ హయతి గ్లామర్, హై-వోల్టేజ్ డ్యాన్స్‌లతో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి! వెంకటేష్ మార్క్ కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ , మాస్ ఎలిమెంట్స్‌ కలయికగా ఈ చిత్రం రూపొందుతోంది.

5 / 5
Follow Us