AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ 29 రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు

Horoscope Today (September 29, 2026): మంగళవారం మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేష రాశి వారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం కాగా, ఆదాయానికి లోటు ఉండదు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పురోగతి, అధికారుల నుంచి నమ్మకం పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఆశించిన స్పందన వచ్చే సూచనలు ఉన్నాయి.

సెప్టెంబర్ 29 రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
Rashi Phalalu 29 Sep 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 29, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (సెప్టెంబర్ 29, 2026): మేష రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయానికి లోటుండదు. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా పురోగమిస్తుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. అధికారులు ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపారాలు కూడా ఉత్సాహంగా పురోగమిస్తాయి. కుటుంబంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీల్లో ఆశించిన లాభాలు అందుతాయి. కొన్ని వ్యక్తిగత పనులు సునాయాసంగా పూర్తవుతాయి. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయానికి లోటుండదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా పురోగమిస్తుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితా లనిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఒకరిద్దరు బంధువులతో అనుకో కుండా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకో వడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ప్రయాణాల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆరోగ్యం చాలావరకుబాగానే ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా అనుకున్న లక్ష్యాల్ని సాధిస్తారు. వృత్తి జీవితం చాలావరకు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితా లనిస్తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం అన్ని విధాలా బాగుంది. మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. దూర ప్రాంత కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఆకస్మికధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి బాగా లబ్ధి పొందుతారు. అద నపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. జీతభత్యాలు, పదోన్నతికి సంబంధించి అధికా రులు సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. పిల్లల్లో ఒకరికి ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులకు అండగా ఉంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

నిరుద్యోగులు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. విదేశీయానానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని లాభదాయక మార్పులు చేపడతారు. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుతాయి. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగులకు పదోన్నతి, జీతభత్యాల పెరుగు దలకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెడతారు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఉన్నా సకా లంలో పూర్తి చేస్తారు. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో పనితీరుతో అధికారులను బాగా ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలపరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. సోదరులతో వివాదం ఒకటి పరి ష్కారం అవుతుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగి పోతాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలపడతాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో కొద్దిగా బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. చేపట్టిన పనులన్నీ కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో నెరవేరుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వ్యాపార కార్యకలాపాలు, లావాదేవీలు లాభదాయకంగా పురోగతి చెందుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో సమస్యల నుంచి బయటపడ తారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను కూడా కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు సాగిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యక్తి గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకోకుండా ఉద్యోగ యోగం పడుతుంది.

Follow Us
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
అతడు అందరిని నమ్మేస్తాడు.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు..
అతడు అందరిని నమ్మేస్తాడు.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు..
నయనతార పిల్లల బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
నయనతార పిల్లల బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
సీమ నీళ్ల నుంచి లిక్కర్‌స్కామ్‌ దాకా.. ఏపీలో తగ్గనంటున్న..
సీమ నీళ్ల నుంచి లిక్కర్‌స్కామ్‌ దాకా.. ఏపీలో తగ్గనంటున్న..