తెలుగు మార్కెట్‌పై నటుడు ధనుష్ ప్రత్యేక దృష్టి సారించారు. సార్, కుబేరా సినిమాల విజయాలతో ఇక్కడ తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు విజయ్ బి కుమార్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న 56వ పాన్ ఇండియా చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.