AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Benefits: 4 సమస్యలకు ఒకే ఔషదం.. వెల్లుల్లిని ఇలా వాడితేనే వరం.. లేదంటే విషం!

ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని వేధిస్తున్న మెటబాలిక్ సిండ్రోమ్‌కు చెక్‌ పెట్టడంతో మన కిచెన్‌లో దొకికే వెళ్లుల్లి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కానీ దానిని సరైన పద్దతిలో ఆహారంలో చేర్చుకుంటేనే దాని పూర్తి ప్రయోజనాలను పొందవచ్చని.. లేదంటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వెళ్లుల్లిని సరైన విధానంలో ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

Garlic Benefits: 4 సమస్యలకు ఒకే ఔషదం.. వెల్లుల్లిని ఇలా వాడితేనే వరం.. లేదంటే విషం!
Raw Garlic Health Benefits
Anand T
|

Updated on: Sep 29, 2026 | 6:40 AM

Share

ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలలో మెటబాలిక్ సిండ్రోమ్ ప్రధానమైనది. ఊబకాయం, అధిక రక్తపోటు , మధుమేహం , అధిక కొలెస్ట్రాల్ వంటి నాలుగింటి కలయికే ఈ మెటబాలిక్ సిండ్రోమ్. అమెరికాలో 35 శాతం మంది, భారతదేశంలో 28 శాతం మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, మన వంటగదిలో నిత్యం వాడే వెల్లుల్లి ఈ నాలుగు రకాల సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ, దీనిని సరైన పద్ధతిలో తీసుకుంటేనే పూర్తి ప్రయోజనాలు అందుతాయి.

వెల్లుల్లిలో ఔషధ గుణం దేనివల్ల వస్తుంది?

వెల్లుల్లికి అసలైన ఔషధ గుణం అందులో ఉండే ‘అలిసిన్’ అనే రసాయన సమ్మేళనం ద్వారా లభిస్తుంది. అయితే వెల్లుల్లిలో అలిసిన్ నేరుగా ఉండదు. ఇది అలిన్, ఎస్-అలిల్ సిస్టీన్ అనే రూపాలలో ఉంటుంది. వెల్లుల్లిని చితగ్గొట్టినప్పుడు, నూరినప్పుడు లేదా ముక్కలుగా చేసినప్పుడు ఎంజైమ్ రియాక్షన్ల వల్ల ఇవి అలిసిన్‌గా మారుతాయి. వెల్లుల్లిలో 3.5 శాతం వరకు ఈ సమ్మేళనాలు ఉంటాయి.

ఎలా వాడాలి? ఎలా వాడకూడదు?

వెల్లుల్లిని అధిక వేడికి గురిచేసినప్పుడు, బాగా మరిగించినప్పుడు లేదా నూనెలో వేయించినప్పుడు అందులోని అలిసిన్ నశించిపోతుంది. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి కేవలం రుచి, వాసన మాత్రమే ఇస్తుంది కానీ ఎలాంటి ఔషధ గుణాలను అందించదు. కాబట్టి, వెల్లుల్లిని పచ్చిగా తినడం, వంట పూర్తయ్యే చివరి నిమిషంలో కూరల్లో కలపడం లేదా తక్కువ మంటపై స్వల్పంగా వేయించుకోవడం ద్వారా అలిసిన్‌ను కాపాడుకోవచ్చు.

మెటబాలిక్ సిండ్రోమ్‌కు సమస్యలపై వెల్లుల్లి ప్రభావం

మధుమేహం నియంత్రణ: వెల్లుల్లిలోని అలిసిన్ కడుపు, పేగులలో ఎసిడోఫిలస్ బ్యాక్టీరియాను పెంచుతుంది. ఈ బ్యాక్టీరియా ‘ఇంక్రిటిన్స్’ అనే రసాయనాలను విడుదల చేసి, ప్యాంక్రియాస్‌లోని బీటా కణాలను ఉత్తేజపరుస్తుంది. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి, ఇన్సులిన్ నిరోధకత తగ్గిపోయి రక్తంలో చక్కెర స్థాయిలు కణాలలోకి సులభంగా చేరుతాయి.

కొలెస్ట్రాల్ తగ్గింపు: అలిసిన్ కాలేయ పనితీరుకు అద్భుతంగా మద్దతు ఇస్తుంది. కొలెస్ట్రాల్ ఉత్పత్తికి అవసరమయ్యే మూడు ప్రధాన ఎంజైమ్‌ల పనితీరును అడ్డుకోవడం ద్వారా, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను వెల్లుల్లి సమర్థవంతంగా నియంత్రిస్తుంది.

ఊబకాయంకి చెక్: శరీరంలోని కొవ్వు కణాలలో కొవ్వును కరిగించే జీన్‌లను వెల్లుల్లి ఉత్తేజపరుస్తుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. ముఖ్యంగా, దేహంలో పేరుకుపోయిన ‘వైట్ ఫ్యాట్’ను సులభంగా కరిగే ‘బ్రౌన్ ఫ్యాట్’గా మార్చడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది.

రక్తపోటు నియంత్రణ: వెల్లుల్లి రక్తనాళాలలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలు పెరిగినప్పుడు రక్తనాళాలు వ్యాకోచించి రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీనివల్ల సహజంగానే రక్తపోటు అదుపులోకి వస్తుంది.

మధుమేహం, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడేవారు రోజుకు 4 నుండి 5 పచ్చి వెల్లుల్లి రెబ్బలను సరైన పద్ధతిలో వాడటం ద్వారా ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్య శాస్త్రం స్పష్టం చేస్తోంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
4 సమస్యలకు ఒకే ఔషదం.. వెల్లుల్లిని ఇలా వాడితేనే వరం
4 సమస్యలకు ఒకే ఔషదం.. వెల్లుల్లిని ఇలా వాడితేనే వరం
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
అతడు అందరిని నమ్మేస్తాడు.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు..
అతడు అందరిని నమ్మేస్తాడు.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు..
నయనతార పిల్లల బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
నయనతార పిల్లల బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో