గర్భసంచిని క్లీన్ చేసే దివ్యౌషధం..నెలసరి నొప్పులకు చెక్ పెట్టే సాంప్రదాయ డ్రింక్!
గర్భాశయాన్ని బలోపేతం చేయడానికి, లోపల పేరుకుపోయిన వ్యర్థాలను శుభ్రం చేయడానికి మన పూర్వీకులు ఈ పానీయాన్ని ఎక్కువగా తాగేవారు. ఇది రుతుక్రమాన్ని క్రమబద్ధీకరిస్తుంది. గర్భాశయంలో ఏర్పడే వాపు ను పూర్తిగా తగ్గిస్తుంది. నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన కడుపు నొప్పిని, తిమ్మిరిని అదుపులో ఉంచుతుంది. ఈ అద్భుతమైన డ్రింక్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం, ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దాం..

మహిళల వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రత గురించి మనం పెద్దగా ఆలోచించం. కానీ, శరీరాన్ని ఎలాగైతే డిటాక్స్ చేస్తామో, అదే విధంగా గర్భాశయాన్ని కూడా ఎప్పటికప్పుడు డిటాక్స్ చేయడం మహిళల ఆరోగ్యానికి అత్యంత ముఖ్యం. హార్మోన్ల మార్పులు, రుతుక్రమం, పూర్తిగా రక్తస్రావం కాకపోవడం వంటి పలు కారణాల వల్ల గర్భాశయంలో టాక్సిన్లు, వ్యర్థాలు పేరుకుపోతాయి. ఈ వ్యర్థాలను సహజ పద్ధతిలో ఇంట్లో ఉండే వస్తువులతోనే సులభంగా తొలగించుకోవచ్చు. అలాంటి ఒక సాంప్రదాయ పానీయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
అల్లం ముక్క – 2 అంగుళాలు
నిమ్మకాయ – 1
పసుపు – అర టీస్పూన్
మిరియాల పొడి – 1 టీస్పూన్
నీళ్లు – 3 కప్పులు
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో మూడు కప్పుల నీటిని తీసుకుని బాగా మరిగించండి. అందులో పొట్టు తీసి, సన్నగా తరిగిన లేదా తురిమిన అల్లం వేయండి. ఆ తర్వాత నిమ్మకాయను గుండ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కలపండి. ఇప్పుడు పసుపు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. మంటను సిమ్ లో పెట్టి పది నిమిషాల పాటు బాగా మరిగించండి. బాగా మరిగిన తర్వాత వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడం ప్రారంభించండి. అంతే, మీ గర్భాశయ డిటాక్స్ డ్రింక్ రెడీ!
ఎలా, ఎప్పుడు తాగాలి?
ఈ పానీయాన్ని ఉదయం, సాయంత్రం టీ లాగా గోరువెచ్చగా తాగాలి. రోజుకు 2 నుండి 3 కప్పుల వరకు తీసుకోవచ్చు. నెలసరి ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు నుండి దీన్ని తాగడం మొదలుపెట్టాలి. ఇలా వరుసగా 5 నుండి 7 రోజుల పాటు తాగితే నెలసరి నొప్పులు లేకుండా సాఫీగా జరుగుతుంది. గర్భాశయంలోని వ్యర్థాలన్నీ పూర్తిగా బయటకు వెళ్లి శుభ్రపడుతుంది.
పదార్థాల వల్ల కలిగే లాభాలు:
అల్లం: యాంటీ ఇన్ఫ్లమేటరీ, నొప్పి నివారణ లక్షణాలు ఉంటాయి. ఇది నెలసరి సమయంలో కడుపు నొప్పిని తగ్గిస్తుంది.
పసుపు: ఇందులోని కర్కుమిన్ పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది. వాపులను తగ్గిస్తుంది.
మిరియాలు: పసుపులోని కర్కుమిన్‌ను శరీరం వేగంగా, అనగా 2000 శాతం ఎక్కువగా గ్రహించేలా చేస్తుంది.
నిమ్మకాయ: ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది పీహెచ్ స్థాయిని సమతుల్యంగా ఉంచి, వ్యర్థాలను బయటకు పంపుతుంది.
ఈ అద్భుతమైన పానీయం తయారు చేయడం ఎంతో సులభం, కానీ మహిళలకు ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను, హార్మోన్ల మార్పులను అదుపు చేయడంలో ఇది ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)




