AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముళ్లకంపపై పడుకుని పూజలు.. గాల్లో గుండ్రంగా తిరిగే పూజారి.. ఒళ్లు గగుర్పొడిచే మారెమ్మ జాతర!

కాలికి చిన్న ముల్లు గుచ్చుకుంటేనే మనం విలవిలలాడిపోతాం.. అలాంటిది ఓ పూజారి ఏకంగా ముల్లకంపలపై పడుకుని పూజలు చేయడం ఒక ఎత్తయితే..అన్ని పదునైన ముళ్ళపై కూర్చున్నా ఒక్క చుక్క రక్తం రాకపోవడం ఒక అంతుచిక్కని అద్భుతం.. అంతేకాదు.. గాలిలో పొడవాటి కర్రకు పూజారిని కట్టి వలయాకారంలో ఆకాశంలో తిప్పే వింత ఆచారం కూడా అక్కడ కనిపిస్తుంది.

ముళ్లకంపపై పడుకుని పూజలు.. గాల్లో గుండ్రంగా తిరిగే పూజారి.. ఒళ్లు గగుర్పొడిచే మారెమ్మ జాతర!
Beluguppa Thanda Festival
Nalluri Naresh
| Edited By: |

Updated on: Sep 28, 2026 | 1:57 PM

Share

కాలికి చిన్న ముల్లు గుచ్చుకుంటేనే మనం విలవిలలాడిపోతాం.. అలాంటిది ఓ పూజారి ఏకంగా ముల్లకంపలపై పడుకుని పూజలు చేయడం ఒక ఎత్తయితే..అన్ని పదునైన ముళ్ళపై కూర్చున్నా ఒక్క చుక్క రక్తం రాకపోవడం ఒక అంతుచిక్కని అద్భుతం.. అంతేకాదు.. గాలిలో పొడవాటి కర్రకు పూజారిని కట్టి వలయాకారంలో ఆకాశంలో తిప్పే వింత ఆచారం కూడా అక్కడ కనిపిస్తుంది. ఇలాంటి ఒళ్లు గగుర్పొడిచే సంప్రదాయాలు, భక్తి పారవశ్యంతో నిండిన వెరైటీ జాతర కు కేరాఫ్ అడ్రస్ అనంతపురం జిల్లా బెలుగుప్ప తాండలో తరతరాలుగా కొనసాగుతున్న మారెమ్మ జాతర..అసలు అక్కడ ఏం జరుగుతుంది..? ఈ ప్రత్యేక తంతు వెనుక ఉన్న సంప్రదాయం ఏంటి..?

అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలోని బెలుగుప్ప తాండలో మారెమ్మ జాతర రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. సంప్రదాయ ఆచారాలు, భక్తుల మొక్కులు, ప్రత్యేక పూజలతో తాండ మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఉరవకొండ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా.. సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో గిరిజనులు, తండావాసులు జాతరకు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు పూర్ణకుంభ కలశాలతో నిర్వహించిన ఊరేగింపుతో జాతర ప్రారంభమైంది. డప్పు వాయిద్యాలు, భక్తుల నినాదాలతో తాండ మార్మోగిపోయింది. అయితే.. ఈ జాతరలో అందరి దృష్టినీ ఆకర్షించింది పూజారి నిర్వహించే ప్రత్యేక తంతే. ఆలయ పూజారి పెద్ద ఎత్తున పేర్చిన పదునైన ముల్లకంపలపై అడుగులు వేస్తూ ముందుకు సాగాడు. ముళ్లను దాటుకుంటూ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం.. అదే ముల్లకంపలపై పడుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాడు.

ముల్లకంపల పదును ఏమాత్రం పట్టించుకోకుండా పూజారి వాటిపై పడుకున్న తీరు భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. డప్పుల మోత.. భక్తుల కేకల నడుమ సాగిన ఈ ఘట్టం జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇంతటితో ఆగలేదు.. మరో ప్రత్యేక కార్యక్రమంలో ఇరుసు తరహాలో ఏర్పాటు చేసిన పొడవాటి కర్రకు పూజారిని కట్టి గాలిలో వలయాకారంలో తిప్పారు. సిరిమానోత్సవాన్ని తలపించే ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయ ఆచారాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆసక్తి చూపించారు. ముఖ్యంగా ముల్లకంపలపై పూజారి పడుకున్న సమయంలో.. పూల పాన్పుపై పడుకున్నట్టుగా ప్రశాంతంగా కనిపించిన తీరు అక్కడికి వచ్చిన వారిని మరింత ఆకట్టుకుంది. భక్తి.. సంప్రదాయం.. సాహసం కలగలిసిన ఈ మారెమ్మ జాతర బెలుగుప్ప తాండలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముళ్లకంపపై పడుకుని పూజలు..గాల్లో గుండ్రంగా తిరిగే పూజారి!
ముళ్లకంపపై పడుకుని పూజలు..గాల్లో గుండ్రంగా తిరిగే పూజారి!
ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. దానం నాగేందర్ బిగ్ బాంబ్!
ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. దానం నాగేందర్ బిగ్ బాంబ్!
వందే భారత్ వర్సెస్ శతాబ్ది.. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఇవే!
వందే భారత్ వర్సెస్ శతాబ్ది.. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఇవే!
బస్సు దిగుతుండగా రోహిత్‌కు ఊహించని ప్రమాదం.. కోహ్లీ ఏం చేశాడంటే.?
బస్సు దిగుతుండగా రోహిత్‌కు ఊహించని ప్రమాదం.. కోహ్లీ ఏం చేశాడంటే.?
UPI రూ.6,000 చెల్లింపును.. రూ.2 చొప్పున 3 సార్లు చేస్తే ఏమవుద్దీ
UPI రూ.6,000 చెల్లింపును.. రూ.2 చొప్పున 3 సార్లు చేస్తే ఏమవుద్దీ
ఇరాన్‌ శాంతి ప్రణాళికను తిప్పి పంపిన ట్రంప్‌ హర్మూజ్‌ కాదు..
ఇరాన్‌ శాంతి ప్రణాళికను తిప్పి పంపిన ట్రంప్‌ హర్మూజ్‌ కాదు..
స్కూళ్ల చుట్టూ జంక్‌ ఫుడ్‌ బ్యాన్‌?
స్కూళ్ల చుట్టూ జంక్‌ ఫుడ్‌ బ్యాన్‌?
ఫుల్లుగా విటమిన్లు, మినరల్స్.. కంటికి, గుండెకు దివ్యాస్త్రం..
ఫుల్లుగా విటమిన్లు, మినరల్స్.. కంటికి, గుండెకు దివ్యాస్త్రం..
ఫుట్‌బ్రిడ్జ్‌పై స్కూటీ చూసి జనం షాక్.. కొత్త షార్ట్‌కట్..?
ఫుట్‌బ్రిడ్జ్‌పై స్కూటీ చూసి జనం షాక్.. కొత్త షార్ట్‌కట్..?
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్, పాక్
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్, పాక్