AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఇండస్ట్రీలోనే తోపు డైరెక్టర్.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు.. రఘు కుంచె..

గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె, దర్శకుడు పూరీ జగన్నాథ్ గతంలో ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక సమస్యలను వెల్లడించారు. ఒకానొక దశలో పూరీ నెలకు రూ.50 లక్షల వడ్డీ కట్టేవారని, అప్పులు తీర్చడానికి తన ఆఫీసును కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని రఘు కుంచె తెలిపారు. పూరీ అద్భుతమైన మానసిక స్థైర్యం, మనుషులను గుడ్డిగా నమ్మే స్వభావం గురించి కూడా ఆయన వివరించారు.

Tollywood : ఇండస్ట్రీలోనే తోపు డైరెక్టర్.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు.. రఘు కుంచె..
Raghu Kunche
Rajitha Chanti
|

Updated on: Sep 28, 2026 | 10:02 PM

Share

సంగీత దర్శకుడు రఘు కుంచె తన సినీ ప్రయాణం గురించి, దర్శకుడు పూరీ జగన్నాథ్ తో తనకున్న అనుబంధం గురించి, అలాగే పూరీ కెరీర్‌లో ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక సవాళ్ళ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులతో పరిచయాలు ఉన్నప్పటికీ, తాను ఎప్పుడూ అవకాశాల కోసం వారిని ఇబ్బంది పెట్టలేదని రఘు కుంచె అన్నారు. అయితే, పూరీ జగన్నాథ్ మాత్రం తనను అడగకుండానే సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చి, సింగర్‌గా ఒక వేదికను అందించారని కృతజ్ఞతలు తెలిపారు. ఇడియట్ సినిమాలోని “లక్ష్మీ లక్ష్మీ”, “జై వీరాంజనేయ” వంటి పాటలతో పాటు శివమణి, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి వంటి చిత్రాలలో తనకు గాయకుడిగా గుర్తింపు వచ్చిందని రఘు కుంచె పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Roja: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయనతో చాలా సినిమాలు చేశా.. హీరోయిన్ రోజా..

అనంతరం, పూరీ జగన్నాథ్ గతంలో ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభంపై రఘు కుంచె సంచలన విషయాలు వెల్లడించారు. ఒకానొక సమయంలో పూరీ జగన్నాథ్ తీవ్రమైన రుణ భారంతో సతమతమయ్యారని, నెలకు ఏకంగా రూ.50 లక్షల వరకు కేవలం వడ్డీనే చెల్లించారని రఘు కుంచె తెలిపారు. “ఏక్ నిరంజన్, బంపర్ ఆఫర్” చిత్రాల సమయంలో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. ఈ అప్పులను తీర్చడానికి పూరీ తన ఎంతో ఇష్టపడి, అద్భుతంగా డిజైన్ చేయించుకున్న కార్యాలయాన్ని కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. రోడ్ నెంబర్ 45లో ఉన్న ఆ కార్యాలయం అద్దెకు మారి, ఆ తర్వాత పోకిరి వంటి విజయాల తర్వాత మళ్ళీ సొంత ఆఫీస్‌లోకి మారారని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: నిజమైన కథతో వచ్చిన 8 ఎపిసోడ్స్ సిరీస్.. 60 దేశాలలో నంబర్ వన్.. ఒక్కసారి చూస్తే అస్సలు వదలరు..

ఈ కష్టాల సమయంలో కూడా పూరీ జగన్నాథ్ అద్భుతమైన మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించారని రఘు కుంచె అన్నారు. సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా పూరీ ప్రశాంతంగా ఉండేవారని, పడి లేవడం ఆయనకు చాలా సాధారణ విషయమని పేర్కొన్నారు. ఈ నిగ్రహ శక్తికి పూరీ చదివే పుస్తకాలు, ఓషో పట్ల ఆయనకు ఉన్న అభిమానం ఒక కారణం కావచ్చని రఘు కుంచె తెలిపారు. అయితే, పూరీ జగన్నాథ్కు మనుషులను గుడ్డిగా నమ్మే స్వభావం ఉందని, ఇదే ఆయనకు తరచుగా ఇబ్బందులను తెచ్చిపెడుతోందని రఘు కుంచె అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. ఆమె నుదుటన సూది మొనంత ప్రేమ రాయలేదు ఆ దేవుడు..

పూరి జగన్నాథ్..

Raghu Kunche,. Puri

Raghu Kunche,. Puri

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంది రా బాబూ పాట.. 2 రోజులుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. డీజేలో మోత మోగిపోద్ది..

Follow Us