పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్న యంగ్ బ్యూటీ అనుపమ
28 September 2026
Rajeev
Pic credit - Instagram
మలయాళ సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్‌గా పరిచయమై.. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అందాల నటి అనుపమ పరమేశ్వరన్.
సహజమైన అందం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, తనదైన నటనతో దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ.. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.
అనుపమ పరమేశ్వరన్ 2015లో వచ్చిన మలయాళ చిత్రం ప్రేమమ్ తో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాలో మేరీ పాత్రలో కనిపించిన అనుపమకు మంచి గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత మలయాళంతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లోనూ అవకాశాలు అందుకుంటూ తన కెరీర్‌లో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కార్తికేయ 2లో అనుపమ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ మంచి హిట్ అవ్వడంతో అనుపమకు కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభించింది.
అనుపమ కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం క్రేజీ కళ్యాణం సినిమాతో రానుంది అనుపమ
అనుపమ నటిస్తున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘భోగి’. శర్వానంద్ హీరోగా నటిస్తుండగా.. అనుపమ కందుల సులోచన రాణి పాత్రలో కనిపించనుంది.