AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rayavalasa : రాయవలస సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. హీరోగా వస్తోన్న కార్తిక్ జయంతి..

కార్తిక్ జయంతి హీరోగా పరిచయమౌతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాయవలస’. రాధిక జయంతి దర్శకత్వం వహిస్తున్నారు. రాయసున్ ప్రొడక్షన్స్ పై గోపీ కృష్ణ జె నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. డెబ్యూ హీరో అయినప్పటికీ కార్తిక్ జయంతి పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్‌తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

Rayavalasa : రాయవలస సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. హీరోగా వస్తోన్న కార్తిక్ జయంతి..
Rayavalasa
Rajitha Chanti
|

Updated on: Sep 28, 2026 | 9:17 PM

Share

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. నూతన నటుడు కార్తిక్ జయంతి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘రాయవలస’ (Rayavalasa). ఇప్పటికే విడుదలైన టీజర్‌తో మంచి అంచనాలను పెంచేసిన ఈ చిత్ర బృందం, తాజాగా ఒక శక్తివంతమైన పోస్టర్‌ను విడుదల చేస్తూ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. విడుదల తేదీని వెల్లడిస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో కార్తిక్ జయంతి చేతిలో త్రిశూలం పట్టుకుని అమ్మవారి విగ్రహం ముందు నిలబడి ఉన్న లుక్ అత్యంత పవర్‌ఫుల్‌గా, ఆధ్యాత్మిక మరియు మాస్ ఎలిమెంట్స్ కలయికగా ఉంది. ఈ చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. హీరో కార్తిక్ జయంతిని కథానాయకుడిగా పరిచయం.. ఆయన తల్లి రాధిక జయంతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రేసన్ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీకృష్ణ జె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: నిజమైన కథతో వచ్చిన 8 ఎపిసోడ్స్ సిరీస్.. 60 దేశాలలో నంబర్ వన్.. ఒక్కసారి చూస్తే అస్సలు వదలరు..

రాయలసీమ నేపథ్యంతో కూడిన వైల్డ్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ ‘రాయవలస’ చిత్రాన్ని నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డెబ్యూ హీరో అయినా కార్తిక్ మాస్ లుక్స్, పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Roja: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయనతో చాలా సినిమాలు చేశా.. హీరోయిన్ రోజా..

ఈ చిత్రంలో శ్రీష నులు హీరోయిన్ గా నటిస్తోంది. అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్ వంటి సీనియర్ నటులతో పాటు త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అర్జున్ బాలా సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పూర్ణ చారి, కార్తిక్ జయంతి, తరుణ్ సైదులు లిరిక్స్ అందించగా, రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రోహిత్ పరిటాల, రమ్య బెహరా, సాహితి చాగంటి, సౌజన్య భగవతుల, వాగ్దేవి, అర్జున్, కార్తిక్ జయంతి వంటి ప్రముఖ గాయకులు పాటలను ఆలపించారు. భావోద్వేగం, యాక్షన్, సంగీతం కలగలిపిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా “రాయవలస” ప్రేక్షకులను అలరించనుంది.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. ఆమె నుదుటన సూది మొనంత ప్రేమ రాయలేదు ఆ దేవుడు..

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంది రా బాబూ పాట.. 2 రోజులుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. డీజేలో మోత మోగిపోద్ది..

Follow Us
గ్రాండ్ గా వస్తున్న కార్తిక్ జయంతి రాయవలస..
గ్రాండ్ గా వస్తున్న కార్తిక్ జయంతి రాయవలస..
రుచికరమైన పట్టా గోబీ లచ్చాపరాఠా ఎప్పుడైనా తిన్నారా? భలే ఉంటుందిలే
రుచికరమైన పట్టా గోబీ లచ్చాపరాఠా ఎప్పుడైనా తిన్నారా? భలే ఉంటుందిలే
నాని ' ది ప్యారడైజ్' సినిమాలో ఆ స్టార్ నటుడి సీన్లు కట్ చేశారా?
నాని ' ది ప్యారడైజ్' సినిమాలో ఆ స్టార్ నటుడి సీన్లు కట్ చేశారా?
భారత్, చైనాలో మనీప్లాంట్ కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
భారత్, చైనాలో మనీప్లాంట్ కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన విత్యా రామ్‌రాజ్
ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన విత్యా రామ్‌రాజ్
ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. ఒకే క్లిక్‌తో పీఎఫ్ సేవలు..
ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. ఒకే క్లిక్‌తో పీఎఫ్ సేవలు..
కళ్లముందే పేకమేడలా కూలిపోయిన కొండ.. నేపాల్‌లో జల ప్రళయం..
కళ్లముందే పేకమేడలా కూలిపోయిన కొండ.. నేపాల్‌లో జల ప్రళయం..
40 కిలోల బరువు తగ్గిన నటి ఖుష్బూ.. వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే
40 కిలోల బరువు తగ్గిన నటి ఖుష్బూ.. వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే
ఓవర్‌థింకింగ్‌ లో బంధీ అయ్యారా? బుద్ధుడు చెప్పిన ఈ కథ మీ కోసమే
ఓవర్‌థింకింగ్‌ లో బంధీ అయ్యారా? బుద్ధుడు చెప్పిన ఈ కథ మీ కోసమే
పింఛన్లపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్.. శుభవార్త వచ్చేసింది..
పింఛన్లపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్.. శుభవార్త వచ్చేసింది..