AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema OTT: నిజమైన కథతో వచ్చిన 8 ఎపిసోడ్స్ సిరీస్.. 60 దేశాలలో నంబర్ వన్.. ఒక్కసారి చూస్తే అస్సలు వదలరు..

92 దేశాలలో ట్రెండింగ్‌లో ఉన్న ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ దేశాలలో 60 దేశాలలో ఈ షో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ సిరీస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సిరీస్ మాత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఈ సిరీస్ పేరెంటో తెలుసుకుందామా.

Rajitha Chanti
|

Updated on: Sep 27, 2026 | 8:16 PM

Share
నిజ సంఘటనల ఆధారంగా అనేక సినిమాలు , వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ 8 ఎపిసోడ్ల వెబ్ సిరీస్. ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు 60 దేశాలలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఆ అమ్మాయి తన తల్లిదండ్రులను చంపిందా? అనే అంశంపైనే ఈ వెబ్ సిరీస్ ఆధారపడి ఉంది. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 17న విడుదలైంది. ఈ క్రైమ్ డ్రామా విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

1 / 5
ఇది విడుదలైన 92 దేశాలలో 60 దేశాలలో నంబర్ వన్ స్థానానికి చేరుకుని, చార్టులలో అగ్రస్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 21 నాటి డేటా ప్రకారం, ఈ వెబ్ సిరీస్ 92 దేశాల్లోని నెట్‌ఫ్లిక్స్ చార్టులలో ట్రెండింగ్‌లో ఉంది. వీటిలో 60 దేశాలలో ఈ షో మొదటి స్థానంలో ఉంది. వీటిలో యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ,న్యూజిలాండ్ ఉన్నాయి.

2 / 5
ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా చూస్తున్న సిరీస్..ఇది లిజ్జీ బోర్డెన్ కేసు ఆధారంగా రూపొందించిన ఒక పరిమిత సిరీస్. 1992 ఆగస్టు 4న, మసాచుసెట్స్‌లోని ఫాల్ రివర్‌లో ఆండ్రూ , అబ్బీ బోర్డెన్‌లు గొడ్డలితో హత్య చేయబడ్డారు. 32 ఏళ్ల లిజ్జీ ప్రధాన అనుమానితురాలిగా మారింది. 1893లో జరిగిన విచారణలో ఆమె నిర్దోషిగా విడుదలైనప్పటికీ, ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది.

3 / 5
విక్టోరియన్ కాలం నాటి ఇళ్లలో మహిళలు ఎదుర్కొన్న వేధింపులు, అవమానాలు , బెదిరింపులను ఈ ధారావాహిక చిత్రీకరిస్తుంది. ఈ ధారావాహికలో కల్పిత అంశాలు కూడా ఉన్నాయి. ఈ షోకి ఇయాన్ బ్రెన్నాన్ షోరన్నర్‌గా వ్యవహరిస్తుండగా, ఎల్లా బెట్టి లిజ్జీ బోర్డెన్ పాత్రను పోషిస్తున్నారు. వారెన్ బెట్టి ,అన్నెట్ బెనింగ్‌ల కుమార్తె అయిన ఎల్లా, గతంలో 'ఫ్యూడ్: కాపోట్ వర్సెస్ ది స్వాన్స్'లో నటించారు.

4 / 5
ఇది నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ సిరీస్ 'మాన్‌స్టర్' కు చెందిన ఒక వెబ్ సిరీస్. 'మాన్‌స్టర్: ది లిజ్జీ బోర్డెన్ స్టోరీ' అనేది నెట్‌ఫ్లిక్స్ 'మాన్‌స్టర్' సిరీస్‌లో నాలుగవ సీజన్. దీనికి ముందు వచ్చిన 3 సీజన్‌లు 'మాన్‌స్టర్ ది జెఫ్రీ డామర్ స్టోరీ', 'మాన్‌స్టర్స్: ది లైల్ అండ్ ఎరిక్ మెనెండెజ్ స్టోరీ', 'మాన్‌స్టర్: ది ఎడ్ గీన్ స్టోరీ' వరుసగా 2022, 2024, 2025 సంవత్సరాలలో విడుదలయ్యాయి.

5 / 5
Follow Us