AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరెరే హోటల్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాస్‌ను గుర్తించడం ఇంత సింపులా?.. ఇన్నాళ్లు తెలీదే!

మనం ఎక్కడికైనా టూర్‌కు వెళ్లినా, లేదా అత్యవసర పనిమీద.. ఇతర నగరాలకు వెళ్లినప్పుడూ.. అక్కడ ఉండే హోటల్స్‌లో స్టే చేస్తూ ఉంటాం. అయితే ఇలా వెళ్లినప్పుడూ చాలా మంది రూమ్‌ నీట్‌గా ఉందా అని మాత్రమే చూస్తారు. కానీ కొన్ని సార్లు రూమ్‌లో రహస్య కెమెరాలు కూడా ఉండవచ్చు. ఇటీవల ఇలా రహస్య కెమెరాలే ఏర్పాటు చేసి బ్లాక్ మెయిలింగ్ చేసిన ఘటనలు మనం చాలానే చూశాం. కాబట్టి హోటల్‌ రూమ్స్‌లో సీక్రెట్‌ కెమెరాలు ఉన్నాయా లేదా సింపుల్‌గా ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూద్దాం.

Anand T
|

Updated on: Sep 28, 2026 | 8:16 PM

Share
మనం వేరే ప్రాంతాలకు వెళ్లి అక్కడ హోటల్స్‌లో బస చేసినప్పుడూ మన గోప్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి హోటల్‌కు వెళ్లినప్పుడూ కేవలం రూమ్‌ మాత్రమే నీట్‌గా ఉందా లేదా అనేది చూడకుండా.. గదిలో విశ్రాంతి తీసుకునే ముందు కొన్ని నిమిషాలు రూమ్‌లోని అన్ని అంశాలను క్షుణ్నంగా గమనించండి.

1 / 5
మీకు హోటల్‌కు వెళ్లినప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే కొన్ని హోటల్ గదుల్లో హిడెన్ కెమెరాలు ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు రూమ్‌లోకి వెళ్లాక.. అక్కడ ఉన్న అలారం గడియారాలు, యూఎస్‌బీ ఛార్జర్లు, స్విచ్ బోర్డులు, ప్లగ్ పాయింట్లు, ఫోటో ఫ్రేమ్‌లు, అద్దాలు, రూమ్ డెకరేషన్ వస్తువులు మధ్య ఏవైనా కెమెరాలు దాచారో లేదా అని నిశితంగా పరిశీలించండి. వాటిని గుర్తించేందుకు మీ గదిలో లైట్స్ ఆపేసి మీ ఫోన్‌ కెమెరా లెన్స్‌ ద్వారా చూస్తే.. సీక్రెట్ కెమెరాస్ ఉన్న ప్రదేశాల్లో రెడ్ లేదా ఆకుపచ్చ రంగు కనిపిస్తాయి. ఏదైనా వస్తువుపై అనుమానం వస్తే వెంటనే దాన్ని ఫోటో తీసి, హోటల్ యాజమాన్యానికి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయండి.

2 / 5
చాలా హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో ఫ్రీ వైఫై ఉంటుంది. అయితే ఈ పబ్లిక్ నెట్‌వర్క్‌లన్నీ పూర్తిగా సురక్షితమైనవని కాకపోవచ్చు. కాబట్టి మీ హోటల్‌లో ఉన్న వైఫై వాడేప్పుడు బ్యాంకింగ్ లావాదేవీలు, ఆన్‌లైన్ పేమెంట్స్ అస్సలూ చేయకండి. మీకు ఎమర్జెన్సీ లావాదేవీలు ఉంటే.. మీ సొంత డేటాను ఉపయోగించి మాత్రమే చేయండి. వైఫై వాడే ముందు హోటల్ నిర్వాహకుల నుంచి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే కనెక్ట్ చేసుకోండి.

3 / 5
అలాగే హోటల్‌లో ఉండే స్మార్ట్ టీవీలు, స్మార్ట్ స్పీకర్లను మీ ఫోన్‌తో కనెక్ట్ చేసి వాడేటప్పుడు జాగ్రత్త వహించండి. టీవీలలో ఏవైనా ఓటీటీ యాప్స్ వాడితే, రూమ్ ఖాళీ చేసే ముందు కచ్చితంగా లాగౌట్ చేయండి. ఇలాంటి పరికరాల్లో బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ నమోదు చేయవద్దు.

4 / 5
మీరు ఏదైనా తెలియని ప్రదేశాలకు వెళ్తుంటే.. ముందే కొన్ని జాగ్రత్తలు వహించాలి.. మీ మొబైల్, ల్యాప్‌టాప్‌లకు సెక్యూర్‌గా ఉండే స్ట్రాండ్ పాస్‌వర్డ్‌లను పెట్టుకోండి. ఒకవేళ మీ ఫోన్ పోయినా లేదా దొంగతనానికి గురైనా ఈజీగా గుర్తించేందుకు మీ ఫోన్లోని Find My Device ఆప్షన్‌ను ఆన్‌లో ఉంచుకోండి. ఈ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీరు తెలియని ప్రదేశాల్లోకి వెళ్లినా సేఫ్‌గా ఉండొచ్చు.

5 / 5
Follow Us
అరెరే హోటల్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాస్‌ను గుర్తించడం ఇంత సింపులా

IIT-JEEలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. ఇప్పుడు దోమ మెదడుపై పరిశోధన

ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.

ఆ హీరోతో యాక్టింగ్ అంటే భయం.. అతడు గొప్ప నటుడు..

రైతులకు కాసుల వర్షమే.. తక్కువ నీటితో నెల తిరిగేసరికి జేబు నింపే..

రాత్రి దానిమ్మ ఆకుల కషాయం తాగితే ఏమవుతుందో తెలుసా?

అన్నా ఇది నువ్వేనా? ధనుష్‌తో ఉన్న ఈటాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?

జావెలిన్ త్రోలో భారత్ డబుల్ ధమాకా
జావెలిన్ త్రోలో భారత్ డబుల్ ధమాకా
విండీస్ పై సిక్సర్ల వర్షం..మూడేళ్ల రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ

కుక్క కాటు మాత్రమే కాదు.. ఇవి కరిచినా రేబీస్‌ ముప్పు!