డిఫరెంట్ సినిమాలు చేసిన హిట్ మాత్రం పడటంలేదు

28 September  2026

Rajeev 

Pic credit - Instagram

నభా నటేష్.. గ్లామర్‌కే కాదు.. విభిన్న పాత్రలకూ కేరాఫ్ అడ్రస్.. ఈ బ్యూటీ చేసే సినిమాలు ఆకట్టుకోకపోయినా తన నటనతో కట్టిపడేస్తుంది. 

టాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయికల్లో నభా నటేష్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల వరుసగా విభిన్నమైన సినిమాలతో రాణిస్తుంది. 

కన్నడ సినిమాతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన నభా నటేష్.. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ముఖ్యంగా ‘నన్ను దోచుకుందువటే’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘డిస్కో రాజా’, ‘మ్యాస్ట్రో’ వంటి సినిమాలు ఆమె కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచాయి.

నభా నటేష్‌కు తెలుగు ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ తీసుకొచ్చిన చిత్రాల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ కీలకమైనది. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.

సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తుంది ఈ వయ్యారి భామ. ఈ బ్యూటీ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ వస్తున్నాయి.