AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2026: పీటీ ఉష 42 ఏళ్ల రికార్డు బద్దలు.. ఏషియన్ గేమ్స్‌లో సంచలనం సృష్టించిన భారత అథ్లెట్

Asian Games 2026: మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్యా రామ్‌రాజ్ 54.75 సెకన్లలో రేసు పూర్తి చేసి కాంస్య పతకం సాధించారు. ఈ క్రమంలో పీటీ ఉష 1984లో నెలకొల్పిన 55.42 సెకన్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టారు. విత్యాకు ఈ ఏషియన్ గేమ్స్‌లో ఇది రెండో పతకం. మిక్స్‌డ్ రిలేలో ఇప్పటికే రజతం సాధించారు.

Asian Games 2026: పీటీ ఉష 42 ఏళ్ల రికార్డు బద్దలు.. ఏషియన్ గేమ్స్‌లో సంచలనం సృష్టించిన భారత అథ్లెట్
Vithya Ramraj
Rakesh
|

Updated on: Sep 28, 2026 | 9:02 PM

Share

Asian Games 2026: జపాన్ వేదికగా జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్ విత్యా రామ్‌రాజ్ చరిత్ర సృష్టించారు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్ పోటీలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే భారత లెజెండరీ అథ్లెట్ పీటీ ఉష గత 42 సంవత్సరాలుగా పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న జాతీయ రికార్డును ఆమె బద్దలు కొట్టారు. ఈ అరుదైన ఘనత సాధించిన విత్యా రామ్‌రాజ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అథ్లెటిక్స్ అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు.

పీటీ ఉష రికార్డును చెరిపేసిన విత్యా రామ్‌రాజ్

గతంలో 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పీటీ ఉష 55.42 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని జాతీయ రికార్డు సృష్టించారు. దాన్ని ఇప్పటివరకు ఎవరూ అందుకోలేకపోయారు. తాజాగా ఏషియన్ క్రీడలలో పోటీపడిన 28 ఏళ్ల విత్యా రామ్‌రాజ్ కేవలం 54.75 సెకన్లలోనే రేసును పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచారు. ఈ అద్భుత ప్రదర్శనతో 42 ఏళ్ల నాటి పాత రికార్డు కనుమరుగైంది. ఈ విభాగంలో యూఏఈ అథ్లెట్ మరియం కరీమ్ స్వర్ణం, కజకిస్తాన్ అథ్లెట్ అడెలీనా రజతం గెలుచుకున్నారు.

 విత్యా రామ్‌రాజ్‌కు ఇది రెండో కాంస్యం

కోయంబత్తూరుకు చెందిన విత్యా రామ్‌రాజ్ ఏషియన్ క్రీడలలో అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నారు. గతంలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లోనూ ఆమె మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించారు. ఇప్పుడు వరుసగా రెండోసారి అదే పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాకుండా ఈసరి టోర్నమెంట్‌లో మిక్స్డ్ 400 మీటర్ల రిలే జట్టుతో కలిసి ఇప్పటికే రజత పతకం సాధించిన ఆమె, వ్యక్తిగతంగా ఈ కాంస్యాన్ని జోడించి సంచలనం సృష్టించారు.

మరో భారత అథ్లెట్ అద్భుత ప్రదర్శన

ఈ ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారతీయ అథ్లెట్ అను రాఘవన్ కూడా అమోఘమైన ఆటతీరును ప్రదర్శించారు. ఆమె 55.88 సెకన్లలో రేసును ముగించి తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసుకున్నారు. ఈ కఠినమైన పోటీలో ఆమె ఐదవ స్థానంలో నిలిచారు. భారతీయ అథ్లెట్లు అంతర్జాతీయ వేదికపై ఇటువంటి నిలకడైన ప్రతిభ కనబరచడం దేశ క్రీడా రంగానికి మంచి భవిష్యత్తును సూచిస్తోంది.

భారత్ పతకాల పట్టికలో పురోగతి

విత్యా రామ్‌రాజ్ సాధించిన ఈ కాంస్యంతో ఏషియన్ క్రీడలలో భారత్ పతకాల సంఖ్య మరింత పెరిగింది. అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు ఇది 14వ పతకం కావడం విశేషం. ఇందులో 6 రజతాలు, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ టోర్నమెంట్‌లో మొత్తం 40 పతకాలతో భారత్ 12వ స్థానంలో కొనసాగుతోంది. అథ్లెటిక్స్ విభాగంలో ఇంకా స్వర్ణ పతకం రాలేనప్పటికీ, క్రీడాకారులు పతకాల సాధనే లక్ష్యంగా దూసుకుపోతున్నారు.

ఇప్పటివరకు భారత్ సాధించిన స్వర్ణ పతకాలు

ఈ టోర్నమెంట్‌లో భారత్ ఇప్పటివరకు నాలుగు స్వర్ణ పతకాలను తన ఖాతాలో వేసుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి విజయం సాధించిన మహిళల క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. అలాగే పురుషుల, మహిళల కబడ్డీ జట్లు తమ జోరును కొనసాగించి స్వర్ణాలు సాధించాయి. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కమల్‌జీత్, సురుచి సింగ్ జోడీ కూడా బంగారు పతకాన్ని గెలుచుకుని దేశం గర్వపడేలా చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!

Follow Us
ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన విత్యా రామ్‌రాజ్
ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన విత్యా రామ్‌రాజ్
ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. ఒకే క్లిక్‌తో పీఎఫ్ సేవలు..
ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. ఒకే క్లిక్‌తో పీఎఫ్ సేవలు..
కళ్లముందే పేకమేడలా కూలిపోయిన కొండ.. నేపాల్‌లో జల ప్రళయం..
కళ్లముందే పేకమేడలా కూలిపోయిన కొండ.. నేపాల్‌లో జల ప్రళయం..
40 కిలోల బరువు తగ్గిన నటి ఖుష్బూ.. వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే
40 కిలోల బరువు తగ్గిన నటి ఖుష్బూ.. వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే
ఓవర్‌థింకింగ్‌ లో బంధీ అయ్యారా? బుద్ధుడు చెప్పిన ఈ కథ మీ కోసమే
ఓవర్‌థింకింగ్‌ లో బంధీ అయ్యారా? బుద్ధుడు చెప్పిన ఈ కథ మీ కోసమే
పింఛన్లపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్.. శుభవార్త వచ్చేసింది..
పింఛన్లపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్.. శుభవార్త వచ్చేసింది..
రణబాలి డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది..
రణబాలి డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది..
అరెరే హోటల్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాస్‌ను గుర్తించడం ఇంత సింపులా
అరెరే హోటల్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాస్‌ను గుర్తించడం ఇంత సింపులా
IIT-JEEలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. ఇప్పుడు దోమ మెదడుపై పరిశోధన
IIT-JEEలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. ఇప్పుడు దోమ మెదడుపై పరిశోధన
ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.