AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా తగ్గిన బంగారం ధర

భారీగా తగ్గిన బంగారం ధర

Samatha J
|

Updated on: Oct 23, 2026 | 3:17 PM

Share

భారతదేశంలో బంగారానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడతారు. పసిడి ధరలు తగ్గితే వెంటనే కొనుగోలు చేయాలని చూస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గడం లేదు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద వాతావరణ పరిస్థితులతో పసిడి ధరలు కిందకు దిగిరావడం లేదు. పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ గా బంగారాన్ని చూస్తుండటంతో ర్యాలీ అలాగే కొనసాగుతోంది. అయితే గత రెండు రోజుల నుంచి పసిడి ప్రియులకు ఊరటనిస్తూ బంగారం ధరలు కాస్త శాంతించాయి

భారతదేశంలో బంగారానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడతారు. పసిడి ధరలు తగ్గితే వెంటనే కొనుగోలు చేయాలని చూస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గడం లేదు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద వాతావరణ పరిస్థితులతో పసిడి ధరలు కిందకు దిగిరావడం లేదు. పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ గా బంగారాన్ని చూస్తుండటంతో ర్యాలీ అలాగే కొనసాగుతోంది. అయితే గత రెండు రోజుల నుంచి పసిడి ప్రియులకు ఊరటనిస్తూ బంగారం ధరలు కాస్త శాంతించాయి. ఈ రొజు పసిడి ధరలు భారీగా తగ్గాయి. అక్టోబరు 22 గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 1700 తగ్గి, రూ.1,44,380 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1550 తగ్గి, రూ.₹1,32,350 పలుకుతోంది. వెండి ధర కేజీ కి రూ.5,000 తగ్గి రూ.2,25,000 పలుకుతోంది. అక్టోబరు 22 గురువారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు పరిశీలిస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,530 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,32,500 పలుకుతోంది. ముంబై,చెన్నై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,44,380 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,350 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ.2,25,000 గా కొనసాగుతోంది.

Published on: Oct 23, 2026 01:09 PM
Follow Us