హర్మూజ్‌లో మళ్లీ హైటెన్షన్.. ఆయిల్ ట్యాంకర్‌పై దాడి .. నౌకలో 21 మంది భారతీయులు!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్ జలసంధిలో MT అల్ దస్మా ఆయిల్ ట్యాంకర్‌పై ప్రొజెక్టైల్ దాడి కలకలం రేపింది. ఈ నౌకలో 21 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. కేంద్ర మంత్రి సెర్బానంద సోనోవాల్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇది ఇలాంటి రెండో ఘటన కావడంతో సముద్ర భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి హార్మూజ్ జలసంధిలో వెలుగు చూశాయి. కువైట్ జెండాతో ప్రయాణిస్తున్న MT అల్ దస్మా అనే ఆయిల్ ట్యాంకర్‌పై గుర్తు తెలియని ప్రొజెక్టైల్ దాడి జరిగింది. ఈ ఘటన అక్టోబర్ 21న ఒమన్‌లోని బుకా ప్రాంతానికి పశ్చిమంగా 11 నాటికల్ మైళ్ల దూరంలో జరిగినట్లు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) గుర్తించింది.దాడితో నౌకలో మంటలు చెలరేగగా, అప్రమత్తమైన సిబ్బంది వాటిని వెంటనే అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ట్యాంకర్‌లో 21 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దాడి జరిగినప్పటికీ, వారంతా సురక్షితంగా ఉన్నారని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సెర్బానంద సోనోవాల్ వెల్లడించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, సిబ్బంది భద్రతపై షిప్ మేనేజ్‌మెంట్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
ప్రమోషన్స్‌లో దూసుకుపోతున్న ‘రామాయణ’ టీమ్
సౌత్ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హృతిక్ రోషన్
గన్ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?
దంపతుల రీల్స్ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా
ఏనుగులకు స్పెషల్ డైట్..
మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడిన డెలివరీ బాయ్
డ్రోన్ అంబులెన్స్‌లు వచ్చేస్తున్నాయ్
ఆ ఊళ్లో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు...వంటచెయ్యరు..ఎందుకో తెలుసా?
కొత్త కారు.. షోరూమ్నుంచి బయటకు తీస్తుండగా..

