AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దసరా జోరు.. దీపావళి వరకు కొనసాగేనా మరి..?

దసరా జోరు.. దీపావళి వరకు కొనసాగేనా మరి..?

Samatha J
|

Updated on: Oct 23, 2026 | 11:20 AM

Share

దసరాకు థియేటర్లలో మొదలైన బాక్సాఫీస్ హంగామా దీపావళి వరకు కొనసాగనుందా? రజనీకాంత్ జైలర్ 2, విజయ్ దేవరకొండ రణబలి చిత్రాలతో మొదలైన విజయ పరంపర, వెంకటేష్ ఆదర్శ కుటుంబం, రామాయణ పార్ట్ 1, సూర్య సీన్, కిరణ్ అబ్బవరం హతః వంటి క్రేజీ సినిమాలతో మరింత ఊపందుకోనుంది. ఈ పండగ సీజన్ ప్రేక్షకులకు భారీ వినోదాన్ని అందిస్తుందని అంచనా.

దసరాకు థియేటర్లలో ప్రారంభమైన బాక్సాఫీస్ సందడి దీపావళి పండుగ వరకు కొనసాగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రజనీకాంత్ నటించిన జైలర్ 2, విజయ్ దేవరకొండ రణబలి చిత్రాలు విజయదశమి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందడంతో వసూళ్ల వర్షం కురిసింది. ఈ విజయ పరంపరను కొనసాగించేందుకు, పండగ సీజన్ ఉత్సాహాన్ని తగ్గకుండా చూసుకునేందుకు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు విడుదల అవుతున్నాయి. దసరాకు మొదలైన ఈ విజయ వేడుకలను మరో స్థాయికి తీసుకువెళ్లేందుకు అక్టోబర్ 30న వెంకటేష్ ఆదర్శ కుటుంబం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని భావిస్తున్నారు.

Follow Us