మహారాష్ట్రలోని వర్ధా జిల్లా తాలెగావ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దారుణం జరిగింది. పోలీసుల సమక్షంలోనే ఖాదిర్ అలీ అనే నిందితుడు విధుల్లో ఉన్న మహిళా వైద్యురాలు డాక్టర్ శ్రద్ధా భూమ్రేపై దాడి చేశాడు. కోర్టులో హాజరుపరిచే ముందు వైద్య పరీక్షల కోసం ఐదుగురు పోలీసు సిబ్బంది సమక్షంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడి వీడియో వైరల్గా మారింది.