తెలుగు అమ్మాయిలనే హీరోయిన్లుగా ప్రోత్సహించాలని నటుడు అలీ పిలుపునిచ్చారు. బాంబే నుంచి నటీమణులను తీసుకురావడం, వారికి హోటళ్లు, ఫుడ్, వాహనాలు, సిబ్బందిని ఏర్పాటు చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. యాభై సినిమాలు చేసినా వారికి తెలుగులో ఒక్క అక్షరం కూడా రాదని, ప్రాంప్టింగ్ ద్వారానే నటిస్తున్నారని అలీ వ్యాఖ్యానించారు.