AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎవర్రా మీరంతా.. స్వీగ్గి పేరుతో వీళ్లు ఏం డెలివరీ చేస్తున్నారో తెలిస్తే మైండ్ బ్లాంకే..

ఆర్డర్ పెడితే బిర్యానీ, టిఫిన్ మాత్రమే డెలివరీ చేస్తారనుకుంటే మీరు పొరబడినట్లే.. స్విగ్గీ డెలివరీ ముసుగులో హైదరాబాద్‌లో ఎలాంటి అక్రమ దందా నడుస్తుందో చూస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. ఫుడ్ బాయ్స్‌లా బ్యాగులు వేసుకుని బైక్‌లపై తిరుగుతూ.. కస్టమర్ల గుమ్మం ముందుకు గంజాయిని డోర్ డెలివరీ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు ఎలా రట్టు చేశారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: ఎవర్రా మీరంతా.. స్వీగ్గి పేరుతో వీళ్లు ఏం డెలివరీ చేస్తున్నారో తెలిస్తే మైండ్ బ్లాంకే..
Ganja Smuggling In Swiggy Bags
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Oct 23, 2026 | 4:26 PM

Share

ఆహారాన్ని అందించే డెలివరీ బ్యాగుల్లో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ ముసుగులో దర్జాగా తిరుగుతూ గంజాయి డోర్ డెలివరీ చేస్తున్న ఇద్దరు నిందితులను మహేశ్వరం ఎస్‌ఓటీ , మంచాల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు ప్రదీప్ నుంచి ఈ ఇద్దరు నిందితులు విజయవాడ కేంద్రంగా గంజాయిని కొనుగోలు చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. పోలీసుల కళ్లుగప్పేందుకు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ బ్యాగులను సాధనంగా ఎంచుకున్నారు. ఆహార పదార్థాల డెలివరీ సిబ్బందిలా వివిధ కాలనీల్లో తిరుగుతూ, తమ నెట్‌వర్క్‌లోని రెగ్యులర్ వినియోగదారులకు గుట్టుగా గంజాయిని డోర్ డెలివరీ చేస్తున్నారు.

డిజిటల్ వేయింగ్ మెషిన్‌తో తూకం

ఈ దందా కోసం నిందితులు ప్రత్యేకంగా డిజిటల్ వేయింగ్ మెషిన్‌ను వినియోగిస్తున్నారు. కస్టమర్ అడిగిన పరిమాణాన్ని బట్టి అక్కడికక్కడే తూకం వేసి ప్యాకెట్లు కట్టి చేరవేస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఫుడ్ డెలివరీ ముసుగులో అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో మంచాల పోలీసులతో కలిసి ఉమ్మడిగా దాడి చేసి ఇద్దరు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు

నిందితుల నుంచి 1.1 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, డిజిటల్ వేయింగ్ మెషిన్, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మంచాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రధాన సరఫరాదారు ప్రదీప్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో పాటు ఈ ముఠా నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్న వినియోగదారుల నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు పోలీసులు కాల్ డేటా ఆధారంగా లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Follow Us
ఈ చిట్కాతో మోకాళ్ళ నొప్పులు పోయి.. వృద్ధాప్యంలో కూడా గుర్రంలా..
ఈ చిట్కాతో మోకాళ్ళ నొప్పులు పోయి.. వృద్ధాప్యంలో కూడా గుర్రంలా..
టీమిండియాలో మోస్ట్ డేంజరస్ ఇతడే.. అడ్డుకోకుంటే సిరీస్ మీకు దక్కదు
టీమిండియాలో మోస్ట్ డేంజరస్ ఇతడే.. అడ్డుకోకుంటే సిరీస్ మీకు దక్కదు
డిసెంబర్ జాతకం.. వీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం
డిసెంబర్ జాతకం.. వీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం
టమాటో పచ్చి మిర్చి పచ్చడి ఇలా చేస్తే.. వదలకుండా తింటారు!
టమాటో పచ్చి మిర్చి పచ్చడి ఇలా చేస్తే.. వదలకుండా తింటారు!
అక్టోబర్ చివరి వారం.. ఈ రాశుల వారికి పండుగే పండుగ!
అక్టోబర్ చివరి వారం.. ఈ రాశుల వారికి పండుగే పండుగ!
ఒక ఆధార్ ఐడీతో ఎన్ని సిమ్‌కార్డ్స్‌ తీసుకోవచ్చు..
ఒక ఆధార్ ఐడీతో ఎన్ని సిమ్‌కార్డ్స్‌ తీసుకోవచ్చు..
ఆన్‌లైన్ కంటే కౌంటర్ వెయిటింగ్ టికెట్లు త్వరగా కన్ఫార్మ్ అవుతాయా
ఆన్‌లైన్ కంటే కౌంటర్ వెయిటింగ్ టికెట్లు త్వరగా కన్ఫార్మ్ అవుతాయా
తెలుగు అమ్మాయి శ్రీ చరణి అదుర్స్.. 3 మెయిడిన్లతో 3 వికెట్లు!
తెలుగు అమ్మాయి శ్రీ చరణి అదుర్స్.. 3 మెయిడిన్లతో 3 వికెట్లు!
ఎవర్రా మీరంతా.. స్వీగ్గి పేరుతో వీళ్లు ఏం డెలివరీ చేస్తున్నారో..
ఎవర్రా మీరంతా.. స్వీగ్గి పేరుతో వీళ్లు ఏం డెలివరీ చేస్తున్నారో..
నిత్యా మీనన్‌తోపాటు ఆ క్రేజీ హీరోయిన్ కూడా..
నిత్యా మీనన్‌తోపాటు ఆ క్రేజీ హీరోయిన్ కూడా..