10 సంవత్సారాలుగా తెలుగు మీడియా క్రైమ్ రిపోర్టింగ్ లో అనుభవం.. టీవీ9 హైదరాబాద్ లో స్థానిక క్రైమ్ వార్తల తో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ల కేసులు,కోర్ట్ సంబంధిత వార్తల కవరెజ్ బాధ్యతలు చూస్తునాను.
60 ఏళ్ల వృద్ధురాలి మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు.. ఎవరో తెలిసి షాక్!
హైదరాబాద్ శివారు నార్సింగ్‌లో అదృశ్యమైన వృద్ధురాలు.. వికారాబాద్ అడవుల్లో శవమై తేలింది. వాకింగ్‌కు వెళ్లిన వృద్ధ మహిళ కనిపించకుండాపోయి.. వారం తర్వాత కుళ్లిపోయిన స్థితిలో శవంగా లభ్యమైంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ నార్సింగ్‌లో మిస్సై.. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల్లో ఎలా చనిపోయింది. అంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది..?
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jun 10, 2025
- 4:21 pm
మరీ ఇంత దారుణమా!.. విదేశీ యువతిపై తల్లి, కొడుకుల పైశాచికత్వం.. గదిలో బంధించి వీడియోలు తీసి మరీ…
వెస్ట్ బెంగాళ్లో జరిగిన ఓ దారుణ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉద్యోగం ఇప్పిస్తానని ఓ యువతికి మాయమాటలు చెప్పి రప్పించిన ఇద్దరు వ్యక్తులు.. ఆ యువతిని ఓ ఫ్లాట్‌లో నిర్భందించి. అసభ్యకర వీడియోలు చిత్రీకరించి తీవ్రంగా దాడి చేసి రోజుల తరబడి పస్తులుంచారు. బార్ డ్యాన్సర్‌గా పనిచేయాలని ఒత్తిడి తెచ్చారు. కీచకుల చెర నుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. అయితే ఆ యువతి నిర్భందించింది టార్చర్ చేసింది ఓ తల్లీ, కొడుకులు కావడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jun 10, 2025
- 3:40 pm
Hyderabad: అదే పనిగా పెళ్లి చేసుకుని మరీ కేస్ పెట్టించుకుంటారు.. వీరికేం రోగం
Hyderabad: వీరిని హైదరాబాద్‌లో ఉంచకుండా నైజీరియన్ దేశానికి డిపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు . ఇప్పటివరకు పదిమందికి పైగానే నైజీరియన్లను హైదరాబాద్ నుండి డిపోర్ట్ సైతం పోలీసులు చేశారు. దీంతో డిపోర్టేషన్‌కు భయపడుతున్న నైజీరియన్లు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. మరోవైపు డిపోర్టేషన్ సందర్భంగా నిందితులకు..
- Lakshmi Praneetha Perugu
- Updated on: May 29, 2025
- 7:21 pm
Cyber Crime: సైబర్ క్రైమ్‌లో మీ డబ్బు పోయిందా? తిరిగి పొందాలంటే ఏం చేయాలి?
Cyber Crime: ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసులు ప్రతి జోన్ కు ఒక సైబర్ సెల్ ను ఏర్పాటు చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఏడు జోన్లు ఉన్నాయి. ప్రతి జోన్ కు ఒక్కో సైబర్ సెల్ ను..
- Lakshmi Praneetha Perugu
- Updated on: May 29, 2025
- 7:05 pm
లక్కీ భాస్కర్ మాదిరి దొరికిన లాటరీ టికెట్.. తీరా చూస్తే…లక్షలు రూపాయలు పాయె..!
కేరళ లాటరీ పేరుతో హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగిని రూ.7.55 లక్షలు కోల్పోయారు. ఆమెను 'లాటరీ గెలిచారు' అని నమ్మించి మోసం చేసిన సైబర్ నేరగాళ్ళపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు 54 ఏళ్ల మహిళ కాగా, ఆమెకు ఫోన్ చేసి ‘కేరళ ప్రభుత్వ లాటరీ సంస్థ’ పేరుతో మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: May 29, 2025
- 12:27 pm
Hyderabad: యాపిల్ యాక్ససరీస్ సగం ధరకే కొంటున్నారా..? మీ కొంప కొల్లేరే బ్రో..!
జగదీష్ మార్కెట్ కు చాలామంది నగరవాసులు మొబైల్స్ రిపేర్ల కోసం సహజంగా వెళుతూ ఉంటారు. అలాంటివారు అక్కడ రిపేర్ జరిగేంతవరకు షాప్ నిర్వాహకులపై ఒక కన్ను వేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో పలు సందర్భాల్లో స్పేర్ పార్ట్స్‌ను సైతం వారు మోసం చేసే ఆస్కారం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: May 27, 2025
- 2:28 pm
100 కోట్ల రూపాయల లగ్జరీ కార్లు అన్ని ఇక్కడికే.. కట్ చేస్తే.. అలా మ్యాటర్ లీక్..!
ఒక్క సమాచారంతో కొద్దిరోజుల క్రితం అహ్మదాబాద్ లో ఉన్న హైదరాబాది కార్ డీలర్ బశరథ్ ను డిఆర్ఐ అహ్మదాబాద్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు తీసుకొచ్చే కార్లను గచ్చిబౌలిలో ఉన్న కార్ లాంజ్ తో పాటు భాషరత్ స్నేహితుడు బిజినెస్ పార్ట్నర్ గా ఉన్న డాక్టర్ అహ్మద్ కి సంబంధించిన ఫామ్ హౌస్ లోనూ కార్లను ఉంచుతూ వచ్చారు. కార్ లాంజ్ షో రూమ్ గచ్చిబౌలిలో లో ఉంది..
- Lakshmi Praneetha Perugu
- Updated on: May 27, 2025
- 2:22 pm
Hyderabad: చదువుకున్నోళ్ళు సైబర్ మోసాలకు బలి.. 38.62 లక్షలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
రోజు రోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రకరాల మార్గాలను ఎంచుకుని అమాయకులను మోసం చేస్తూ డబ్బులు కాజేస్తున్న కేటుగాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అయితే ఇలా సైబర్ మోసాలకు చదువుకున్న వారు కూడా బలి అవ్వడం షాకింగ్ కలిగించే విషయమే. ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ.. సైబర్ మోసాల గురించి అవగాహన ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం లక్షలు పోగొట్టుకుని బాధితులుగా మారుతున్నారు. తాజాగా భాగ్యనగరానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగి లక్షల్లో పోగొట్టుకున్నాడు
- Lakshmi Praneetha Perugu
- Updated on: May 1, 2025
- 4:01 pm
అక్షయ తృతీయ పేరుతో ఘరానా మోసం..రూ. 10కోట్లు మోసం చేసి పారిపోయిన వ్యాపారి
ఒక ఆభరణాల వ్యాపారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ మోసగించిన బంగారం వ్యాపారి ఇటీవలే హోల్‌సేల్ బిజినెస్ ప్రారంభించాడని, అతని కుటుంబం ornamental stones వ్యాపారంలో పేరొందినదని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపోతున్నారు పోలీసులు.. ప్రస్తుతం బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం అని పోలీసుకు చెబుతున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: May 1, 2025
- 2:20 pm
Hyderabad: బ్రాండెడ్ సరుకు అని కుమ్మేస్తున్నారా..? అసలు విషయం తెలిస్తే బుర్ర పాడే!
నిత్యం ఆహారం, ఇతర నిత్యావసర వస్తువుల్లో కల్తీని చూస్తున్న ప్రజలకు, చివరకు మద్యం కూడా కల్తీ అవుతుందని విషయం తెలుసుకుని షాక్‌కు గురవుతున్నారు. హైదరాబాద్ లింగంపల్లి ప్రాంతంలో ఒక బార్లో అక్రమంగా మద్యాన్ని కల్తీ చేస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన చాలా రోజుల నుండి జరుగుతున్న ఎక్సైజ్ పోలీసుల దాడితో వెలుగులోకి వచ్చింది.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Apr 25, 2025
- 6:44 pm
Hyderabad: అగ్ని ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నాలజీ.. త్వరలో అందుబాటులోకి రెస్క్యూ రోబోస్!
ప్రపంచంలో అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీలు ఏవైనా తమకు పనికొస్తాయి అనుకుంటే ప్రభుత్వాలు వాటిని త్వరగా తమ రాష్ట్రాలకు తెప్పించుకోవాలని అనుకుంటాయి. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీతో రూపొందించిన ఫైర్ ఫైటర్ రోబో కిట్లు కలిగిన వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఏవైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను కాపాడేందుకు, ప్రమాద స్థాయిని నివారించేందుకు ఉపయోగపడుతుంది.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Apr 20, 2025
- 8:22 am
Hyderabad: పదేపదే బయట జ్యూస్ తాగుతున్నారా.? మీ కథ కైలసానికే..
హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్వహించిన అకస్మాత్తు తనిఖీల్లో పలు జ్యూస్ సెంటర్ల పరిస్థితులు బట్ట బయలు అయ్యాయి. ఆమీర్‌పేట్ వేంగల్రావ్ నగర్ ప్రాంతాలలో జ్యూస్ సెంటర్ పై అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. ప్రజలు నిత్యం తాగే పండ్ల రసాల వెనుక భయంకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Apr 18, 2025
- 7:51 pm