AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంబీబీఎస్ సీట్ పేరుతో భారీ స్కామ్.. ప్రముఖ గైనకాలజిస్ట్‌నే నిలువునా ముంచేశారు కదరా…!

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ సీట్ పేరుతో భారీ స్కామ్ వెలుగు చూసింది. తన కుమారుడికి మెడికల్ అడ్మిషన్ ఖాయం అవుతుందని నమ్మిన 44 ఏళ్ల గైనకాలజిస్ట్‌నే ఓ ‘ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ’ తెలివిగా టార్గెట్ చేసింది. మాయ మాటలతో నమ్మించి లక్షల్లో దోచుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు

ఎంబీబీఎస్ సీట్ పేరుతో భారీ స్కామ్.. ప్రముఖ గైనకాలజిస్ట్‌నే నిలువునా ముంచేశారు కదరా...!
Mbbs Seat Scam
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Feb 27, 2026 | 11:09 AM

Share

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ సీట్ పేరుతో భారీ స్కామ్ వెలుగు చూసింది. తన కుమారుడికి మెడికల్ అడ్మిషన్ ఖాయం అవుతుందని నమ్మిన 44 ఏళ్ల గైనకాలజిస్ట్‌నే ఓ ‘ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ’ తెలివిగా టార్గెట్ చేసింది. మాయ మాటలతో నమ్మించి లక్షల్లో దోచుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు

ఫేస్‌బుక్‌లో కనిపించిన గ్లామర్ అడ్వర్టైజ్‌మెంట్‌కి ఆకర్షితురాలైన డాక్టర్ అమీర్‌పేట్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నీట్ కౌన్సెలింగ్ ఫర్మ్‌ను కాంటాక్ట్ చేశారు. సీట్ గ్యారెంటీ అంటూ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసిన ప్రతినిధులు ముందుగా రూ.5 లక్షలు సర్వీస్ చార్జ్‌గా కలెక్ట్ చేశారు. నవంబర్ 20, 2025న ఎల్‌బీ నగర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ కన్‌ఫర్మ్ అయిందని చెప్పి, మరో రూ.13.9 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. కానీ తర్వాత ఇచ్చిన అలాట్‌మెంట్ లెటర్ ఫేక్ అని తేలడంతో అసలు విషయం బయటపడింది.

మోసపోయానని తెలుసుకున్న సదరు డాక్టర్ కన్సల్టె్న్సీని సంప్రదించారు. రీఫండ్ అడిగితే డిలే టాక్టిక్స్‌తో టైమ్ పాస్ చేశారనే ఆరోపించారు. దీంతో చేసేదీలేక పోలీసులను ఆశ్రయించారు డాక్టర్. ఆమె ఫిర్యాదు ఆధారంగా మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయ్యింది. ఆ తర్వాత దర్యాప్తు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)కి షిఫ్ట్ చేశారు. దీంతో ఆపరేషనల్ డైరెక్టర్, డైరెక్టర్‌తో పాటు టీమ్ మెంబర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

ప్రాథమిక విచారణలో ఇదే కన్సల్టెన్సీ మరికొందరు పేరెంట్స్ నుంచి రూ.3 లక్షలు, రూ.15.3 లక్షలు, రూ.5.75 లక్షలు, రూ.13 లక్షలు, రూ.5 లక్షలు వసూలు చేసినట్టు విచారణలో బయటపడింది. మొత్తం కలిపి సుమారు రూ.1.15 కోట్ల స్కామ్ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే గ్యారెంటీ సీట్లు, డైరెక్ట్ అడ్మిషన్ ప్రకటనలను గుడ్డిగా నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అధికారిక నీట్ కౌన్సెలింగ్ మార్గాల ద్వారానే అడ్మిషన్లు జరుగుతాయని, మిగతావి స్కామ్ అయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నయనతార హ్యాపీగా జీవించాలంటే రోజుకి ఎంత కావాలి?
నయనతార హ్యాపీగా జీవించాలంటే రోజుకి ఎంత కావాలి?
చంపేస్తున్నారు.. ముక్కలుగా నరికేస్తున్నారు! వీరి మైండ్ సెట్ ఇదే
చంపేస్తున్నారు.. ముక్కలుగా నరికేస్తున్నారు! వీరి మైండ్ సెట్ ఇదే
ఆ టాలీవుడ్ స్టార్ హీరో మరదలు.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఆ టాలీవుడ్ స్టార్ హీరో మరదలు.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఆంధ్రా స్పెషల్.. ఉక్కులాంటి బలాన్నిచ్చే సూపర్ లడ్డు..
ఆంధ్రా స్పెషల్.. ఉక్కులాంటి బలాన్నిచ్చే సూపర్ లడ్డు..
నెలకు రూ.9000తో 45 ఏళ్లకే రిటైర్మెంట్.. నెలకు రూ.2 లక్షల పెన్షన్!
నెలకు రూ.9000తో 45 ఏళ్లకే రిటైర్మెంట్.. నెలకు రూ.2 లక్షల పెన్షన్!
శుభ గ్రహాల యుతి.. అదృష్టవంతులు కాబోయే రాశులివే..!
శుభ గ్రహాల యుతి.. అదృష్టవంతులు కాబోయే రాశులివే..!
పాకిస్తాన్ ప్లేయర్లకు గ్రీన్ సిగ్నల్.. భారత్‌లో ఆడేందుకు అనుమతి..
పాకిస్తాన్ ప్లేయర్లకు గ్రీన్ సిగ్నల్.. భారత్‌లో ఆడేందుకు అనుమతి..
జస్ట్ 5 నిమిషాల్లో తెలంగాణ పచ్చి పులుసు.. తెపాళ్ల లేపాల్సిందే
జస్ట్ 5 నిమిషాల్లో తెలంగాణ పచ్చి పులుసు.. తెపాళ్ల లేపాల్సిందే
అసెంబ్లీ బరిలో త్రిష ?? విజయ్ వదిలేసే స్థానం నుంచి పోటీ..!
అసెంబ్లీ బరిలో త్రిష ?? విజయ్ వదిలేసే స్థానం నుంచి పోటీ..!
గంటసేపు కారులో ఏసీ ఆన్ చేస్తే.. ఎంత పెట్రోల్ ఖర్చవుతుందో తెలుసా?
గంటసేపు కారులో ఏసీ ఆన్ చేస్తే.. ఎంత పెట్రోల్ ఖర్చవుతుందో తెలుసా?