WhatsApp: వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. ఇది మాములుగా లేదు భయ్యా.. ఇక పండుగే.. పండుగ
వాట్సప్ మరో అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. ఇక నుంచి వెబ్ బ్రౌజర్ ద్వారా కూడా వాయిస్, వీడియో కాల్స్ మాాట్లాడుకోవచ్చు. ఇప్పటివరకు యాప్ ద్వారా మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు వెబ్ వెర్షన్లో కూడా ప్రవేశపెట్టింది మెటా.

స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరి ఫోన్‌లో తప్పనిసరిగా వాట్సాప్ అనేది ఉంటుంది. అయితే యూజర్లను ఆకట్టుకునేందుకు మెటా సంస్థ.. ఎప్పటికప్పుడు వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్లను తీససుకొస్తుంది. అందులో భాగంగా తాజాగా మరో స్టన్నింగ్ ఫీచర్ అందుబాటులోకి తీసకొచ్చింది. ఇప్పటివరకు వాట్సప్ ద్వారా వీడియో లేదా వాయిస్ కాల్ మాట్లాడాలంటే యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. ఇక సిస్టమ్ ద్వారా మాట్లాడాలంటే.. డెస్క్‌టాప్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇక నుంచి ఆ అవసరం లేదు. డెస్క్ టాప్ యాప్ డౌన్ లోడ్ చేసుకోకుండానే వెబ్ బ్రౌజర్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడవచ్చు. ఈ మేరకు కొత్త వెబ్ ఆధారిత ఫీచర్‌ను మోటా ప్రారంభించింది.
ప్రత్యేక కాల్స్ ట్యాబ్
ఈ ఫీచర్ వ్యక్తిగత కాల్స్‌తో పాటు గ్రూప్ కాల్స్‌కు కూడా పనిచేస్తుంది. ఇక స్క్రీన్ షేరింగ్, రియాక్షన్స్, హిస్టరీ, ఫేవరెట్స్ కోసం ప్రత్యేక కాల్స్ ట్యాబ్ కూడా ఉంటుంది. మీరు షేర్డ్ కంప్యూటర్ వాడుతున్నా లేదా ఆఫీస్ ల్యాప్‌టాప్ ఉపయోగిస్తున్నా బ్రౌజర్‌ను వదలకుండానే వీడియో లేదా వాయిస్ కాల్స్ మాట్లాడవచ్చు. దీంతో పాటు వాట్సాప్ ‘కాల్ ట్రాన్స్‌ఫర్’ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్న గ్రూప్ కాల్‌ను డిస్‌కనెక్ట్ చేసి మళ్లీ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేకుండానే.. మొబైల్ ఫోన్ నుండి డెస్క్‌టాప్‌కు వంటి డివైజ్‌ల మధ్య సులభంగా కాల్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు కాల్ కట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి ఆ అవసరం ఉండదు. సులభంగా ఒక డివైస్ నుంచి మరో డివైస్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇక ‘వెయిటింగ్ రూమ్’ ఫీచర్‌ను కూడా వాట్సప్ తీసుకొచ్చింది.
వెయిటింగ్ రూమ్ ఫీచర్
వెయిటింగ్ రూమ్ ఫీచర్ ద్వారా.. కాల్ లింక్ జనరేట్ అయిన తర్వాత హోస్ట్ యాక్సెస్‌ను ఆమోదించే వరకు పార్టిసిపెంట్లు ఒక వర్చువల్ వెయిటింగ్ ఏరియాలో ఉంచబడతారు. దీంతో పాటు ‘క్విక్‌హెచ్‌డి’ ఫీచర్ ప్రవేశపెట్టింది. కాల్ ప్రారంభమైన వెంటనే హై-డెఫినిషన్ వీడియోను అందించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అలాగే ‘నాయిస్ సప్రెషన్’ ఫీచర్ కూడా తీసుకొచ్చింది. శబ్దంతో కూడిన లేదా రద్దీగా ఉండే పరిసరాలలో కూడా ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా కాల్స్ మాట్లాడుకోవచ్చు. విడతల వారీగా ఈ ఫీచర్లను విడుదల చేయనున్నట్లు వాట్సప్ స్పష్టం చేసింది. యూజర్లకు మెరుగైన భద్రతను అందించంలో ఈ ఫీచర్లు ఉపయోగపడతాయని తెలిపింది. వాట్సప్ ఇటీవల అనేక ఫీచర్లను తీసుకొస్తుంది. అత్యంత వేగంగా ఫీచర్లను అభివృద్ది చేస్తోంది.
