నకిలీ క్యూఆర్ కోడ్‌ను ఎలా గుర్తించాలి?
Venkatrao Lella
Images: Pinterest
16 July 2026
ఈ రోజుల్లో చిన్న దుకాణం నుండి పెద్ద మాల్ వరకు ప్రతి చోటా చెల్లింపు కోసం క్యూఆర్ కోడ్‌ను ఉపయోగిస్తున్నారు
ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి UPI యాప్‌ల ద్వారా తక్షణ చెల్లింపులు చేస్తున్నారు
కానీ ఏమీ చెక్ చేసుకోకుండా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పేమెంట్ చేయడం వల్ల మీరు సమస్యల్లో పడవచ్చు
కొందరు మోసగాళ్లు నకిలీ క్యూఆర్ కోడ్‌లను ఉపయోగించి మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేవచ్చు. మరి దీన్ని ఎలా గుర్తించాలి? అంటే..
మీరు డబ్బు చెల్లించిన తర్వాత షాపులోని సౌండ్ బాక్స్ నుండి వచ్చే శబ్దాన్ని గమనించండి. శబ్దం రాకపోతే జాగ్రత్త వహించండి.
QR కోడ్ గురించి మీకు ఏమైనా సందేహం ఉంటే.. దాన్ని గూగుల్ లెన్స్‌తో స్కాన్ చేసి తప్పకుండా ఒకసారి సరిచూసుకోండి
అలాగే చెల్లింపు చేసేటప్పుడు దుకాణం లేదా యజమాని పేరును తప్పకుండా సరిచూసుకోండి. పేరు తప్పుగా ఉంటే వెంటనే అడగండి
అన్నింటికన్నా ముఖ్యంగా, డబ్బు చెల్లించమని అడుగుతూ గుర్తు తెలియని నంబర్ నుండి మీకు కాల్ లేదా మెసేజ్ వస్తే అప్రమత్తంగా ఉండండి.