ఒక్క రోజులోనే మహిళలకు భారీ షాకిచ్చిన బంగారం.. మళ్లీ భగ్గుమన్న ధరలు

July 27, 2026

Subhash

దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్లే పట్టి మళ్లీ భగ్గుమంటున్నాయి. తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా భారీగా పెరిగాయి. వెండి ధరల్లో మార్పు లేదు.

ధరల్లో మార్పు

దాదాపు రెండు వారాలుగా నడుస్తున్న అమెరికా - ఇరాన్ దేశాల మధ్య శత్రుత్వం కాస్త శాంతించింది. శుక్రవారం రాత్రి నుంచి  రెండు దేశాలు దాడులు ఆపేసి, ఒమన్ దేశం ద్వారా ఇరాన్ చర్చలు జరుపుతోంది. 

రెండు వారాలుగా 

ఈ పరిణామాలతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 6% తగ్గాయి. దింతో  డబ్ల్యూటీఐ క్రూడ్ $85, బ్రెంట్ క్రూడ్ $93 కంటే తక్కువకు పడిపోయాయి.

 ముడి చమురు

జూలై 27న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 930 రూపాయలు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల10 గ్రాములపై 850 రూపాయలు పెరిగింది.

జూలై 27న

ధరలు పెరిగిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,860 రూపాయలకు చేరగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,33,700 వద్ద కొనసాగుతోంది.

ధరలు

హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల  ధర  రూ.1,45,860, 22క్యారెట్ల  ధర రూ.1,33,700, 18 క్యారెట్ల  ధర   రూ.1,09,390 వద్ద ఉంది.  

తెలుగు రాష్ట్రాల్లో..

ఇక వెండి ధర ఈ రోజు ఎలాంటి మార్పులు లేకుండా  స్థిరంగా కొనసాగుతోంది. 1 గ్రాము ధర  రూ.240 ఉండగా.. కిలో వెండి ధర  రూ.2,40,000 కొనసాగుతోంది.

వెండి ధర

బుధవారం జరగనున్న అమెరికా  ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లపై నిర్ణయం రానుంది. కొద్దిగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, ఈసారే రేట్లు పెంచుతారనే అంచనాలు ఉన్నాయి. 

వడ్డీ రేట్లపై..