కారు ఎప్పుడు అత్యధికంగా పెట్రోల్‌ను వినియోగిస్తుందో మీకు తెలుసా?

July 24, 2026

Subhash

వాహనం నడిపేటప్పుడు మనం చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్ల వల్లే పెట్రోల్ ఎక్కువ ఖర్చవుతుంది. అవేంటో ఓ సారి చూద్దాం..!

వాహనం నడిపేటప్పుడు 

సిటీలో లేదా భారీ ట్రాఫిక్‌లో కారును పదేపదే ఆపుతూ, మళ్లీ స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లడం వల్ల ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడి పడి పెట్రోల్ ఎక్కువగా ఖర్చవుతుంది.

ట్రాఫిక్‌లో పదేపదే ఆగడం

ఎక్సలేటర్‌ను వేగంగా తొక్కడం, ఉన్నపళంగా హఠాత్తుగా బ్రేకులు వేయడం వల్ల ఇంధన సామర్థ్యం (Mileage) గణనీయంగా పడిపోతుంది.

అకస్మాత్తుగా వేగం పెంచడం

కారును పరిమితికి మించిన అత్యధిక వేగంతో (High Speed) నిరంతరం నడపడం వల్ల గాలి నిరోధకత పెరిగి, ఇంజిన్ ఎక్కువ పెట్రోల్‌ను పీల్చుకుంటుంది.

మితిమీరిన వేగం

సిగ్నల్స్ దగ్గర లేదా ఎవరికోసం అయినా వేచి చూసేటప్పుడు కారును ఆఫ్ చేయకుండా సుదీర్ఘకాలం స్టార్ట్‌లోనే ఉంచడం వల్ల అనవసరంగా ఇంధనం వృథా అవుతుంది.

స్టార్ట్ చేసి ఉంచడం

టైర్లలో ఉండాల్సిన సరిపడా గాలి (Air Pressure) లేనప్పుడు రోడ్డుపై ఘర్షణ పెరుగుతుంది. దీనివల్ల కారు ముందుకు కదలడానికి ఇంజిన్ మరింత శ్రమించాల్సి వచ్చి మైలేజ్ తగ్గుతుంది.

టైర్లలో తక్కువ గాలి

కారు బూట్ స్పేస్‌లో లేదా లోపల అనవసరమైన భారీ వస్తువులను వేసుకొని తిరగడం వల్ల వాహనం బరువు పెరిగి పెట్రోల్ వినియోగం పెరుగుతుంది.

కారుపై అదనపు భారం

ఎయిర్ ఫిల్టర్లు, ఇంజిన్ ఆయిల్, స్పార్క్ ప్లగ్‌లను క్రమం తప్పకుండా చెక్ చేయకపోవడం వల్ల కారు పర్ఫార్మెన్స్ తగ్గి, ఇంధనం ఎక్కువ తాగుతుంది.

నిర్లక్ష్యమైన సర్వీసింగ్