AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మొత్తం 275 ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్ర పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మొత్తం 275 ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
TSLPRB Sub Inspector Recruitment
Srilakshmi C
|

Updated on: Jul 31, 2026 | 7:11 PM

Share

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్ర పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 275 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో మాత్రమే స్వీకరించనున్నారు. దరఖాస్తు ప్రారంభ తేదీలు, చివరి తేదీలను త్వరలో ప్రత్యేకంగా ప్రకటించనున్నట్లు TSLPRB వెల్లడించింది.

శాఖల వారీగా పోస్టుల వివరాలు

తెలంగాణ పోలీస్ శాఖలో పోస్టులే ఇవే..

  • ఎస్‌సీటీ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) పోస్టుల సంఖ్య: 148
  • ఎస్‌సీటీ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (AR) పోస్టుల సంఖ్య: 14
  • ఎస్‌సీటీ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SAR CPL – పురుషులు) పోస్టుల సంఖ్య: 3
  • ఎస్‌సీటీ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (TGSP – పురుషులు) పోస్టుల సంఖ్య: 12

తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో పోస్టులు ఇవే..

  • ఎస్‌సీటీ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల సంఖ్య: 44

తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ శాఖలో పోస్టులు ఇవే..

  • స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 39

తెలంగాణ జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ శాఖలో పోస్టులు ఇవే..

  • డిప్యూటీ జైలర్ (పురుషులు) పోస్టుల సంఖ్య: 14
  • డిప్యూటీ జైలర్ (మహిళలు) పోస్టుల సంఖ్య: 1

తెలంగాణలో పోలీస్‌ శాఖలో ఎస్‌ఐ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. యూజీసీ, ఏఐసీటీఈ లేదా సంబంధిత గుర్తింపు సంస్థల ఆమోదం పొందిన ఓపెన్ యూనివర్సిటీ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా పొందిన డిగ్రీలు పొందిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టుకు అదనంగా చెల్లుబాటు అయ్యే ఎల్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జూలై 1 నాటికి 21 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్టంగా 5 సంవత్సరాలు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లకు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ విధానం), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫైనల్ రాత పరీక్ష (4 పేపర్లు) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ఎస్‌ఐ (సివిల్), ఆర్‌ఎస్‌ఐ, ఎస్‌పీఎఫ్ ఎస్‌ఐ పోస్టులకు రూ.42,300 నుంచి రూ.1,15,270 వరకు జీతంగా చెల్లిస్తారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టులకు రూ.38,890 నుంచి రూ.1,12,510 వరకు జీతం చెల్లిస్తారు. దరఖాస్తు తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

అభ్యర్థులు సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికెట్లు ఇవే..

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభానికి ముందే అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని TSLPRB సూచించింది.

ఎస్సీ అభ్యర్థులు ఎస్సీ గ్రూప్-1, 2, 3 ఉపవర్గీకరణతో కూడిన తాజా సామాజిక ధ్రువపత్రం, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువపత్రం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2026 ఏప్రిల్ 1 తర్వాత ప్రభుత్వం జారీ చేసిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌, బీసీ అభ్యర్థులు: 2026 ఏప్రిల్ 1 తర్వాత పొందిన నాన్-క్రీమీలేయర్ సర్టిఫికెట్, 1 నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్లు లేదా నివాస ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులు, క్రీడాకారులు తదితర ప్రత్యేక కేటగిరీలకు చెందిన వారు సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

తెలంగాణలో పోలీస్‌ శాఖలో ఎస్‌ఐ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us