కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మల్లో సప్తమి గౌడ ఒకరు. 2023లో అభిషేక్ అంబరీష్ నటించిన కాళీ సినిమాతో ఆకట్టుకుంది.
అలాగే బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది వ్యాక్సిన్ వార్ మూవీలో నటించింది సప్తమి గౌడ.
ఈ అమ్మడు హీరోయిన్ గానే కాదు. స్పోర్ట్స్ లోనూ తోపే.. ఐదేళ్ల వయసులో సప్తమి గౌడ ఈత శిక్షణ పొందింది. 2006 నుంచి 2010 వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది.
జతీయ స్థాయిలో పలు స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న సప్తమి గౌడ ఎన్నో రజత, కాంస్య, బంగారు పతకాలను కైవసం చేసుకుంది.
అలాగే పాప్‌కార్న్ మంకీ టైగర్ సినిమాకు గాను ఉత్తమ తొలి నటిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును గెలుచుకుంది
రిషభ్ శెట్టి తెరకెక్కించి, అతనే ప్రధాన పాత్రలో నటించన కాంతార సినిమాతో భారీ హిట్ అందుకుంది సప్తమి గౌడ.
తెలుగులో నితిన్ నటించిన తమ్ముడు సినిమాలో మెరిసింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో మళ్లీ తెలుగులో కనిపించలేదు సప్తమి.