AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HCA President: హెచ్‌సీఏ కొత్త అధ్యక్షుడిగా అమర్‌నాథ్.. అంబుడ్స్‌మన్ కీలక ఆదేశాలు..

HCA New President: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 2023 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అంబుడ్స్‌మన్ జస్టిస్ సురేష్ కుమార్ కైత్, ప్రస్తుత అధ్యక్షుడు జగన్ మోహన్ రావును పదవి నుంచి తొలగిస్తూ సంచలన తీర్పునిచ్చారు. ఆయన స్థానంలో గెలాక్సీ క్రికెట్ క్లబ్‌కు చెందిన అమర్‌నాథ్‌ను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించారు.

HCA President: హెచ్‌సీఏ కొత్త అధ్యక్షుడిగా అమర్‌నాథ్.. అంబుడ్స్‌మన్ కీలక ఆదేశాలు..
Amarnath Declared New Hca President
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Feb 03, 2026 | 8:59 AM

Share

HCA New President: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలాక్సీ క్రికెట్ క్లబ్ ప్రతినిధి, మాజీ సెంట్రల్ ఎక్సైజ్ అధికా, హెచ్‌సీఏ సీనియర్ సభ్యుడు మిస్టర్ అమర్‌నాథ్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2023లో జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఫోర్జరీ పత్రాలతో జగన్ మోహన్ రావు పోటీ చేశారని అమర్‌నాథ్ దాఖలు చేసిన ఫిర్యాదుపై అంబుడ్స్‌మన్ జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

వివాదం నేపథ్యం..

అక్టోబర్ 20, 2023న జరిగిన ఎన్నికల్లో అమర్‌నాథ్ కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో (62-63) జగన్ మోహన్ రావు చేతిలో ఓడిపోయారు. అయితే, జగన్ మోహన్ రావు ‘శ్రీ చక్ర క్లబ్’ పేరుతో సమర్పించిన పత్రాలు నకిలీవని అమర్‌నాథ్ ఫిర్యాదు చేశారు. గౌలీపురా సిసి పేరును శ్రీ చక్ర సిసిగా మార్చడం చట్టవిరుద్ధమని 2018లోనే అప్పటి అంబుడ్స్‌మన్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి తీర్పునిచ్చారని, కాబట్టి ఆ క్లబ్ ఉనికిలో లేదని అమర్‌నాథ్ పేర్కొన్నారు.

అంబుడ్స్‌మన్ తీర్పులో ముఖ్యాంశాలు..

పదవి నుంచి తొలగింపు: జగన్ మోహన్ రావుపై తీవ్రమైన ఆరోపణలు ఉండటం, ఇప్పటికే హెచ్‌సీఏ ఆయనను సస్పెండ్ చేయడం వంటి కారణాల దృష్ట్యా ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగడానికి అనర్హుడని అంబుడ్స్‌మన్ స్పష్టం చేశారు.

కొత్త అధ్యక్షుడి ప్రకటన: సంస్థ కార్యకలాపాలు ఆగిపోకూడదనే ఉద్దేశంతో, రన్నరప్‌గా నిలిచి 62 ఓట్లు సాధించిన అమర్‌నాథ్‌ను అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నట్లు జస్టిస్ కైత్ తెలిపారు.

గడువు: అమర్‌నాథ్ వారం రోజుల్లోగా బాధ్యతలు స్వీకరించాలని, మిగిలిన తొమ్మిది నెలల కాలానికి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతారని ఆదేశించారు.

అమర్‌నాథ్ స్పందన: ఈ తీర్పుపై స్పందించిన అమర్‌నాథ్, ఇది న్యాయానికి దక్కిన విజయమని కొనియాడారు.

“హెచ్‌సీఏ గత వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి, తెలంగాణ జిల్లాల్లో అట్టడుగు స్థాయి నుంచి క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి నేను నిరంతరం కృషి చేస్తాను. క్లబ్ సెక్రటరీలకు గౌరవం ఇస్తూ, మహిళా, పురుష క్రికెటర్లకు మెరుగైన వసతులు కల్పిస్తాను” అని ఆయన హామీ ఇచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..