AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన జారీ.. ఈ జిల్లాలకు అలర్ట్..

Weather Report: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన జారీ.. ఈ జిల్లాలకు అలర్ట్..
Ap Telangana Weather Update
Venkatrao Lella
|

Updated on: Nov 28, 2026 | 1:35 PM

Share

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రంలో నవంబర్ 29న ఏర్పడే ఉపరితల ఆవర్తనం నవంబర్ 30 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. ఇది డిసెంబర్ 2 నాటికి వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది. వీటి ఫలితంగా ఏపీలో  రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణశాఖ జారీ చేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. పొగ మంచు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. పొగ మంచు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్..

ప్రస్తుతం నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే పరిస్థితి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్ర, మార్కాపురం, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. నవంబర్ 29 తర్వాత వర్షాల తీవ్రత, గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 60 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఊరటనిస్తూ..  పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఈ ఆకస్మిక వాతావరణ మార్పు అనేక ప్రాంతాలపై ప్రభావం చూపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలు, మేడ్చల్ మల్కాజ్‌గిరి, భువనగిరి, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వర్షాలు ప్రధానంగా స్థానిక వాతావరణ మార్పులు వల్ల వచ్చాయని, ఇవి తాత్కాలిక మార్పు మాత్రమేనని వివరించింది. డిసెంబర్ నెల నుంచి తెలంగాణలో చలి తీవ్రత గణనీయంగా పెరుగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎల్ నినో ప్రభావం మార్చి వరకు ఉంటుందని, ఆ తర్వాత దాని ప్రభావం తగ్గుముఖం పట్టి జూన్, జులై నాటికి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. ఎల్ నినో ప్రభావం వల్ల ఈసారి చలి సాధారణం కన్నా రెండు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. చలి తీవ్రతతో పాటు పొగమంచు కూడా అధికంగా ఉండే అవకాశం ఉన్నందున రోజువారీ ప్రయాణికులు, వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Follow Us