AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. భార్య నిద్రపోతుండగా గొడ్డలితో నరికి చంపిన భర్త.. ఆ తరువాత ఏం చేశాడంటే..?!

రంగారెడ్డి జిల్లా నోముల గ్రామంలో భయంకర ఘటన చోటుచేసుకుంది. భర్త బాబు తన భార్య అమృతను ₹1000 అప్పు విషయంలో జరిగిన గొడవ, మద్యం మత్తులో గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, మద్యం దురలవాటు ఈ దారుణానికి కారణమని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

దారుణం.. భార్య నిద్రపోతుండగా గొడ్డలితో నరికి చంపిన భర్త.. ఆ తరువాత ఏం చేశాడంటే..?!
Crime
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Feb 24, 2026 | 8:07 PM

Share

హైదరాబాద్‌ శివారు రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాగిన మత్తులో ఒక వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు. పీకల దాకా తాగేసిన మైకంలో అతడు తన భార్యతో గొడవకు దిగాడు.. ఈ క్రమంలోనే పక్కనే గొడ్డలి కనిపించింది. దాంతో ఆమెపై విచక్షాణా రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ ఇల్లాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలో ఉన్న నోముల గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. 1000 రూపాయల అప్పు విషయంపై దంపతుల మధ్య గొడవ మొదలైంది. పోలీసులు హంతకున్ని పట్టుకోవడానికి రంగం లోకి దిగారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. నోముల గ్రామానికి చెందిన మధర్మోని బాబు మధ్యాహ్నం దాదాపు 2:30 గంటల సమయంలో తన భార్య మధర్మోని అమృతతో గొడవకు దిగాడు. గత శుక్రవారం శివరాత్రి జాతర సందర్భంగా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు భర్త బాబు మద్యం సేవించి భార్య అమృతతో గొడవ పడ్డాడు. శనివారం పనికి వెళ్లకుండా, పని చేసే చోట తెచ్చుకున్న 1000 రూపాయల అప్పు విషయంపై మళ్లీ దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవతో మనస్తాపం చెందిన అమృత ఆ రోజు నుండి భర్తతో మాట్లాడటం మానేసింది.

ఇదిలా ఉండగా, రోజూ మాదిరిగానే మంగళవారం ఉదయం తమ ఇద్దరు కొడుకులు పనికి వెళ్లిపోయారు. ఆ తర్వాత, ఇంట్లో ఉన్న కోడలు చిన్న పాపను పడుకోబెట్టడానికి బెడ్రూంలోకి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన బాబు బయటి డోర్ లాక్ చేశాడు. హాల్లో దివాన్ పై నిద్రపోతున్న అమృతపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. మెడ, దవడంపై బలంగా నరకటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసిన అనంతరం బాబు గోడ్డలిని అక్కడే వదిలి పరారయ్యాడు. బెడ్రూంలో ఉన్న కోడలు శబ్దాలు విని బయటకు రావడానికి ప్రయత్నించగా, బయట నుంచి గడియ పెట్టి ఉండటంతో ఆమె బయటకు రాలేకపోయింది. భర్తకు, ఇరుగుపొరుగు వారికి ఫోన్‌ చేసిన సమాచారం అందజేసింది.

ఇవి కూడా చదవండి

స్థానికులు వచ్చి చూసే సరికి అమృత రక్తపు మడుగులో పడి ఉంది. సమాచారం అందుకున్న మంచాల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. భర్త బాబును పట్టుకోవడానికి పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది కుటుంబ గొడవలు, మద్యం మత్తు , ఆర్థిక సమస్యల వల్ల జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us