AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందార మొక్క శక్తి తెలుసా? సరైన దిశలో నాటితే అదృష్టం మీ సొంతం.. ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందట!

ప్రతి ఇంటికి వాస్తు తప్పనిసరిగా పాటిస్తారు.. ఇంటికి మాత్రమే కాదు. ప్రతి నిర్మాణానికి వాస్తు తప్పనిసరి అని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఇల్లు, ఆఫీసులు, కార్యాలయాలు వంటి నిర్మాణాలే కాదు.. ఇంట్లోని వస్తువులకు కూడా వాస్తు తప్పనిసరి. అలాగే, మన ఇంటి దిశలతో పాటు చెట్లు, మొక్కలు కూడా వాస్తు పరంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మందార మొక్కకు వాస్తు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఎర్రని పువ్వు వాస్తులో ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుందని భావిస్తారు. లక్ష్మీదేవికి కూడా ఈ పువ్వు అంటే ఎంతో ప్రియం. రోజూ పూజలో వాడితే శుభం కలుగుతుందని నమ్మకం. మరీ మందార మొక్క వాస్తు ఏంటో ఇక్కడ చూద్దాం..

మందార మొక్క శక్తి తెలుసా? సరైన దిశలో నాటితే అదృష్టం మీ సొంతం.. ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందట!
Hibiscus Plant
Jyothi Gadda
|

Updated on: Feb 19, 2026 | 1:12 PM

Share

Hibiscus Plant Vastu: ప్రతి ఇంటికి వాస్తు తప్పనిసరిగా పాటిస్తారు.. ఇంటికి మాత్రమే కాదు. ప్రతి నిర్మాణానికి వాస్తు తప్పనిసరి అని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఇల్లు, ఆఫీసులు, కార్యాలయాలు వంటి నిర్మాణాలే కాదు.. ఇంట్లోని వస్తువులకు కూడా వాస్తు తప్పనిసరి. అలాగే, మన ఇంటి దిశలతో పాటు చెట్లు, మొక్కలు కూడా వాస్తు పరంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మందార మొక్కకు వాస్తు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఎర్రని పువ్వు వాస్తులో ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుందని భావిస్తారు. లక్ష్మీదేవికి కూడా ఈ పువ్వు అంటే ఎంతో ప్రియం. రోజూ పూజలో వాడితే శుభం కలుగుతుందని నమ్మకం. మరీ మందార మొక్క వాస్తు ఏంటో ఇక్కడ చూద్దాం..

ఇంటి ప్రధాన ద్వారం వద్ద మందార చెట్టును ఉంచితే దుష్టశక్తులు దూరమవుతాయని, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఐశ్వర్యం పెరుగుతుందని నమ్ముతారు. మందార మొక్కను ఇంట్లోకి సానుకూల వాతావరణాన్ని తెస్తుందని నమ్ముతారు, ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద నాటితే… శుభప్రదంగా పరిగణిస్తారు. జాతకంలో కుజ దోషం లేదా వివాహ జీవితంలో సమస్యలు ఉంటే మందార మొక్క నాటడం వల్ల మంగళ దోషం తొలగిపోతుందని నమ్ముతారు.

ఎర్రని మందార పువ్వులు దుర్గ, కాళి దేవికి చాలా ఇష్టం. కాబట్టి దీని మొక్కను ద్వారం వద్ద నాటితే దేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. లక్ష్మిదేవికి మందార పువ్వు అంటే చాలా ఇష్టం. మీ ఇంట్లో పూచే మందార పూలతో అమ్మవారికి పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ప్రధాన ద్వారం వద్ద మందార మొక్కను నాటితే అదృష్టాన్ని తెస్తుంది. దీనివల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి. వాస్తు శాస్త్ర ప్రకారంగా మందారం మొక్కను ఉత్తరం లేదా తూర్పు వైపున నాటడం లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.

ఇవి కూడా చదవండి

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us