పెళ్లిపై ఓపెన్ అయిన టాలీవుడ్ హీరోయిన్.. ఏం చెప్పిందంటే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

18 March 2026

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో రాశీ ఖన్నా ఒకరు. చాలా కాలంగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ సరైన బ్రేక్ మాత్రం అందుకోలేకపోయింది. 

ఇన్నాళ్లు తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రాశీ ఖన్నా.. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో కీలకపాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో పాల్గొంటుంది రాశీ.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తన పెళ్లి, రిలేషన్ షిప్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ గురించి సైతం చెప్పుకొచ్చింది. 

ఇండస్ట్రీలో తనకు ఫ్రెండ్స్ ఉన్నారని.. కానీ తరచూ వారిని కలిసేంత సమయం మాత్రం ఉండడం లేదని అన్నారు. ముంబై, ఢిల్లీ నగరాల్లో ఉన్నారని చెప్పుకొచ్చింది. 

అలాగే ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీలు పెళ్లిల్లు చేసుకుంటున్నారు.. మీ పెళ్లెప్పుడు అని యాంకర్ అడగ్గా.. నవ్వుతూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది రాశీ ఖన్నా. 

ప్రస్తుతం తనకు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదని.. ఒకవేళ ఆలోచన ఉంటే అందరికీ తెలిసిపోతుంది కదా.. అయినా ఆ సమయంలో నేను చెప్పను అని అన్నారు. 

ఇప్పటివరకు తన జీవితంలో అలాంటి వ్యక్తి లేరని.. ఒకవేళ తాను పెళ్లి చేసుకునే నిర్ణయం తీసుకుంటే ఆ వ్యక్తిని కచ్చితంగా మీ అందరికీ పరిచయం చేస్తానని అన్నారు.