AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపరేషన్ క్రాక్ డౌన్.. తెలంగాణలో ఎంత మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లు ఉన్నారో తెలుసా?

సైబర్ నేరాలపై కఠినంగా వ్యవహరిస్తున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టింది. “ఆపరేషన్ క్రాక్ డౌన్” పేరుతో నిర్వహించిన ఈ ప్రత్యేక దాడుల్లో సైబర్ మోసాలకు వినియోగిస్తున్న మ్యూల్ అకౌంట్‌లపై దృష్టి సారించారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఒకేసారి దాడులు నిర్వహించి అనుమానాస్పద బ్యాంక్ లావాదేవీలను సమగ్రంగా పరిశీలించారు.

ఆపరేషన్ క్రాక్ డౌన్.. తెలంగాణలో ఎంత మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లు ఉన్నారో తెలుసా?
Mule Accounts
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Feb 25, 2026 | 8:38 PM

Share

సైబర్ నేరాలపై కఠినంగా వ్యవహరిస్తున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో (Telangana Cyber Security Bureau) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టింది. “ఆపరేషన్ క్రాక్ డౌన్” పేరుతో నిర్వహించిన ఈ ప్రత్యేక దాడుల్లో సైబర్ మోసాలకు వినియోగిస్తున్న మ్యూల్ అకౌంట్‌లపై దృష్టి సారించారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఒకేసారి దాడులు నిర్వహించి అనుమానాస్పద బ్యాంక్ లావాదేవీలను సమగ్రంగా పరిశీలించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 137 మంది సైబర్ సెక్యూరిటీ పోలీసులు పాల్గొన్నారు. 137 బ్యాంక్ బ్రాంచ్‌లలో తనిఖీలు చేపట్టి 1,886 మ్యూల్ అకౌంట్‌లను గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఈ ఖాతాలు 9,431 సైబర్ క్రైమ్ కేసులకు ముడిపడి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు, జాబ్ ఫ్రాడ్‌ల ద్వారా సేకరించిన డబ్బును ఈ ఖాతాల ద్వారా మార్పిడి చేస్తున్నట్లు గుర్తించారు.

మ్యూల్ అకౌంట్‌ల సృష్టి, నిర్వహణలో కొందరు బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం లేదా ప్రత్యక్ష ప్రమేయం ఉందేమో అన్న కోణంలోనూ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పలువురు బ్యాంక్ అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అవసరమైతే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబర్ సెక్యూరిటీ అధికారులు స్పష్టం చేశారు. గత ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ పోలీసులు 4,775 మ్యూల్ అకౌంట్‌లను గుర్తించారు. ఈ ఏడాది సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరాలకు అజాగ్రత్తగా లేదా తెలియకుండానే తమ బ్యాంక్ ఖాతాలను ఇవ్వొద్దని, అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచించారు.

సైబర్ నేరాలను అరికట్టేందుకు “ఆపరేషన్ క్రాక్ డౌన్” కొనసాగుతుందని, రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచుతామని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..