YouTuber Komali: ప్రేమికుడితో బ్రేకప్.. తీవ్ర మనస్తాపంతో చివరికి
యూట్యూబర్ కోమలి హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీలో ఆత్మహత్య చేసుకున్నారు. యూట్యూబర్ అఖిల్‌తో ప్రేమ విఫలం కావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆత్మహత్యాయత్నం చేసిన కోమలి, తాజాగా ప్రియుడితో ఫోన్ సంభాషణ తర్వాత ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ చిత్రపురి కాలనీలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడటం విషాదం నింపింది. మరొక యూట్యూబర్ అయిన అఖిల్‌తో మూడేళ్లుగా ప్రేమలో ఉన్న కోమలి, ఇటీవల బ్రేకప్ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. గతంలోనూ ఆమె ఆత్మహత్యాయత్నం చేయగా, కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడారు. అయితే, రెండు రోజుల క్రితం అఖిల్‌తో ఫోన్‌లో వాగ్వాదం జరిగిన తర్వాత కోమలి తన ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పొరుగింటి వారు డోర్ కొట్టినప్పటికీ తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డోర్ పగులగొట్టి చూడగా, కోమలి విగతజీవిగా కనిపించింది. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి, తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వచ్చిన పార్సిల్.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..
పాత స్మార్ట్‌ఫోన్లలో విలువైన గోల్డ్.. భవిష్యత్ కోసం
కుక్క నాకడంతో ఇన్ఫెక్షన్.. సగం కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ
Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్ మరణాలకు కారణం అదేనా ??
పగలు కానిస్టేబుల్‌గా, రాత్రి ర్యాపిడో రైడర్‌గా.. కుటుంబ పోషణ కోసం తపన..చివరికి ఇలా
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!
బైక్‌పై ప్రేయసి కూర్చుంటే.. మేఘాలలో తేలిపోవడమే!
యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం

