AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాత స్మార్ట్‌ఫోన్లలో విలువైన గోల్డ్‌.. భవిష్యత్ కోసం

పాత స్మార్ట్‌ఫోన్లలో విలువైన గోల్డ్‌.. భవిష్యత్ కోసం

Phani CH
|

Updated on: Feb 25, 2026 | 1:20 PM

Share

పాత ఫోన్లలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి విలువైన అయస్కాంత మూలకాలుంటాయి. వీటిని విదేశాల నుండి దిగుమతి చేసుకునే బదులు, భారత్ ఈ-వ్యర్థాల నుండి వెలికితీయడం ద్వారా వేలాది కోట్లు ఆదా చేయగలదు. ఈ మూలకాలు యుద్ధ విమానాలు, విద్యుత్ వాహనాలు, క్షిపణుల తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది చైనా వంటి దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి, రక్షణ రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధిగా చేస్తుంది. దేశీయంగా శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

కొత్త ఫోన్‌ కొనగానే పాతదానిని చెత్తబుట్టలో పడేయడం చాలామందికి అలవాటు. కానీ ఆ పాత ఫోన్‌లో ‘రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌’గా పిలిచే విలువైన అయస్కాంత మూలకాలు ఉంటాయి. వేలాది కోట్లు ఖర్చు చేసి వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బదులు ఈ పాత ఫోన్ల నుంచే అరుదైన మూలకాలను వెలికి తీస్తే? వాటిని యుద్ధ విమానాల్లో, విద్యుత్‌ వాహనాల్లో, క్షిపణుల తయారీలో వాడితే? కేంద్రం ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఆలోచనే చేస్తోంది. టన్ను ముడిఖనిజం నుంచి కేవలం ఒకట్రెండు కిలోల కోబాల్ట్‌ మాత్రమే తీయగలం. అదే టన్ను పాత బ్యాటరీల నుంచి ఏకంగా 50 నుంచి 80 కేజీల దాకా సమీకరించవచ్చు. పైగా ముడిఖనిజ కోబాల్ట్‌ కంటే ఇది 40 శాతం ఎక్కువ గాఢతతో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో ఎన్నో విలువైన ఖనిజాలుంటాయి. వాటిపై భారత్‌ ఇప్పటిదాకా సరైన దృష్టి పెట్టలేదని నిపుణులు అంటున్నారు. యుద్ధ విమానాలు తేలికగా , దృఢంగా ఉండటానికి నియోడైమియం అనే మూలకమే కారణమట. యుద్ధ విమానాలలో ఇంధనం ప్రవాహాలు, రెక్కల కదలికలు, కాక్‌పిట్‌కు కరెంటు సరఫరా చేసే జనరేటర్లను పర్యవేక్షించే సెన్సార్లకు ఇవే శక్తినందిస్తాయని అంటున్నారు. భారత్‌ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వేస్ట్‌ను విదేశాలకు అనవసరంగా ఎగుమతి చేస్తోంది. అలా కాక భారత్‌లోనే భారీగా శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఆ వేస్ట్‌లోని అయస్కాంత మూలకాలను వెలికితీసి యుద్ధ విమానాల తయారీలో వాడొచ్చు. అరుదైన ఖనిజాల కోసం చైనా వంటి ప్రత్యర్థి దేశాలపై ఆధారపడే దురవస్థ తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుక్క నాకడంతో ఇన్ఫెక్షన్.. సగం కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ

Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్‌ మరణాలకు కారణం అదేనా ??

పగలు కానిస్టేబుల్‌గా, రాత్రి ర్యాపిడో రైడర్‌గా.. కుటుంబ పోషణ కోసం తపన..చివరికి ఇలా

Mamta Mohandas: ‘రాజమౌళి అలా అనేసరికి నా గుండె పగిలిపోయింది’

Auto Ram Prasad: డైరెక్టర్‌గా కొత్త జర్నీ.. మొదలు పెట్టిన ఆటో రాంప్రసాద్

Follow Us