పగలు కానిస్టేబుల్‌గా, రాత్రి ర్యాపిడో రైడర్‌గా.. కుటుంబ పోషణ కోసం తపన..చివరికి ఇలా
హైదరాబాద్‌లో ఓ హోంగార్డు జీతం చాలక రాపిడో రైడర్‌గా పనిచేస్తూ విషాదకరంగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. బంజారాహిల్స్ వద్ద జరిగిన ఈ ఘటనలో ప్రయాణికురాలు అక్షిత కూడా మరణించారు. హోంగార్డు సయ్యద్ హుస్సేన్ మరణంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఇది కేవలం ప్రమాదం కాదు, హోంగార్డుల ఆర్థిక కష్టాలకు నిదర్శనం. పోలీస్ శాఖ అండగా ఉన్నా, తండ్రి లేని లోటు తీర్చలేనిది.
ఖాకీ డ్రెస్ వేసుకొని ప్రజల రక్షణ కోసం పనిచేసే కానిస్టేబుల్ వచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోక రాత్రిపూట ర్యాపిడో రైడర్‌గా పనిచేస్తూ బ్రతుకుబండిని లాగుతున్నాడు. అతని పోరాటం చూసి విధికి కన్ను కుట్టిందో..ఏమో కానీ పాపం రోడ్డు ప్రమాద రూపంలో అతడిని బలితీసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెం.10 వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిరుపేద హోంగార్డు కుటుంబాన్ని అనాథను చేసింది. సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న సయ్యద్ హుస్సేన్ , వచ్చే చాలీచాలని జీతంతో ముగ్గురు పిల్లలను సాకలేక ‘రాపిడో’ రైడర్‌గా పార్ట్ టైమ్ పని మొదలు చేస్తున్నాడు. సోమవారం ఉదయం తన బైక్‌పై ప్రయాణికురాలు అక్షిత ను బైక్‌పై తీసుకు వెళ్తుండగా, వెనుక నుంచి అతివేగంతో వచ్చిన వాటర్ ట్యాంకర్ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తలరించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ కన్నుమూశారు. ఈ ఘటన కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు, హోంగార్డుల ఆర్థిక కష్టాలకు అద్దం పడుతోంది. చెప్పుకోవడానికి పోలీస్ ఉద్యోగమే కానీ, కడుపు నిండని జీతాలు” అంటూ తోటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేసారు. హుస్సేన్ మరణంతో ఆయన ముగ్గురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. అటు చదువు కోసం హైదరాబాద్ వచ్చిన యువతి అక్షిత మరణం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.బంజారాహిల్స్ పోలీసులు ట్యాంకర్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని సిఐ ప్రకటించినప్పటికీ, ఆ ముగ్గురు చిన్నారులకు తమ తండ్రి లేని లోటు తీర్చలేనిదంటూ స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mamta Mohandas: ‘రాజమౌళి అలా అనేసరికి నా గుండె పగిలిపోయింది’
Auto Ram Prasad: డైరెక్టర్‌గా కొత్త జర్నీ.. మొదలు పెట్టిన ఆటో రాంప్రసాద్
Yash: కటింగ్ చేసిన ‘సింహం’ మాదిరి.. KGF హీరో లుక్‌పై కామెడీ సెటైర్లు
‘కొడవ’ పద్దతిలో విజయ్, రష్మిక వివాహం.. ఈ పెళ్లి ప్రత్యేకలు ఏంటంటే ??
పగలు కానిస్టేబుల్‌గా, రాత్రి ర్యాపిడో రైడర్‌గా.. చివరికి ఇలా
మెట్రో పిల్లర్‌పై చిక్కుకున్న పిల్లి.. ఎలా కాపాడారంటే..
గ్రామ సర్పంచ్ ఇంటిముందు క్షుద్రపూజలు
స్మశానంలో దెయ్యలతో కలసి మనుషులు మందు పార్టీ..
వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చిన అతిథులు..
హోలికా దహనంలో ఈ కలపను వాడుతున్నారా.. జాగ్రత్త
ట్విన్స్ డే రోజు అరుదైన ఘటన..

