AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'కొడవ' పద్దతిలో విజయ్, రష్మిక వివాహం.. ఈ పెళ్లి ప్రత్యేకలు ఏంటంటే ??

‘కొడవ’ పద్దతిలో విజయ్, రష్మిక వివాహం.. ఈ పెళ్లి ప్రత్యేకలు ఏంటంటే ??

Phani CH
|

Updated on: Feb 25, 2026 | 12:32 PM

Share

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26న తెలుగు, కొడవ సంప్రదాయ పద్ధతుల్లో జరగనుంది. కొడవ వివాహంలో అగ్నిహోత్రం లేకుండా పెద్దల ఆశీర్వాదంతో ముహూర్తం, గంగపూజ ప్రధానం. పూజారులుండరు, కుటుంబ పెద్దలే నిర్వహిస్తారు. పెళ్లి తర్వాత పాండి కర్రీ (పోర్క్) వడ్డించడం ప్రత్యేక ఆచారం. ఈ ప్రత్యేక ఆచారాలు వీరి పెళ్లికి మరింత నిండుదనం తీసుకురానున్నాయి.

సమంత ‘భూత శుద్ది’ వివాహం చేసుకున్నారని తెలియగానే.. అందరూ ఆ వివాహ ప్రక్రియ ఏంటని ఆరా తీశారు. గూగుల్లో సెర్చ్‌ చేసి మరీ తెలుసుకున్నారు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫిబ్రవరి 26న జరగనుంది. మరి వీరు ఏ పద్దతిలో పెళ్లి చేసుకుంటున్నారు? విజయ్‌ తెలంగాణ వాసి కాబట్టి.. తెలంగాణ పద్దతిలోనే పెళ్లి చేసుకుంటున్నారా? లేదా రష్మిక కొడవ హిందూ కుంటుంబంలో జన్మించారు కాబట్టి.. కొడవ లేదా కూర్గ్‌ పద్దతిలో వివాహం చేసుకోబోతున్నారా? లేదా రెండు సంప్రదాయ పద్దతుల్లో వీరి పెళ్లి జరగనుందా? అనే విషయం పై తాజాగా ఓ అప్డేట్ బయటికి వచ్చింది. కొడవ, తెలుగు సంప్రదాయాల ప్రకారం విజయ్‌ దేవరకొండ, రష్మిక వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. తెలుగు సంప్రదాయం ప్రకారమే విజయ్ రష్మిక మెడలో మాంగళ్య ధారణ చేస్తారట. దాంతో పాటే కొడవ సంప్రదాయం ప్రకారం కూడా వీరిద్దరూ ఒక్కటవనున్నారట. ఈ వివాహ పద్దతి ప్రత్యేకతలు ఏంటంటే? నీలగిని ప్రాంతాన్ని కొడనాడు లేదా కొడవ అంటారు. ఈ ప్రాంతాల్లో జరిగే వివాహాలు.. సాదారణ హిందూ వివాహాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటాయి. సాధారణంగా హిందూ వివాహాల్లో హోమం లేదా అగ్ని చుట్టూ ఏడడుగులు వేస్తారు. కానీ కొడవ సంప్రదాయంలో అగ్ని లేకుండానే, పెద్దల ఆశీర్వాదంతో వివాహం జరుగుతుంది. ముహూర్తం అనేది.. కొడవ వివాహ క్రతువులో ప్రధానమైన ఘట్టం. వరుడు, వధువు తమ తమ ఇళ్లలో లేదా కళ్యాణ మంటపంలో విడివిడిగా ఈ ముహూర్త వేడుకను జరుపుకుంటారు. పెద్దలు వారి తలపై అక్షింతలు చల్లి ఆశీర్వదిస్తారు. ఇక కొడవ వివాహ పద్దతిలో… గంగపూజ ప్రధానం. వివాహం తర్వాత వధువు, వరుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పూజ నిర్వహిస్తారు. వధువు నీటి బిందెను తలపై పెట్టుకుని నడుస్తుంటే, వరుడి తరపు వారు ఆమెను అడ్డుకుంటూ సరదాగా ఆటపట్టిస్తారు. ఇది ఆమె ఆ కుటుంబంలో బాధ్యతలను స్వీకరించడానికి ప్రతీక. అంతేకాదు కొడవ వివాహ పద్దతిలో పూజారులు లేదా బ్రాహ్మణుల ప్రమేయం ఉండదు. కుటుంబంలోని పెద్దలే అన్ని ఆచారాలను నిర్వహిస్తారు. అంతేకాదు కొడవ వివాహాల్లో పాండి కర్రీ వంటి ప్రత్యేక మాంసాహార వంటకాలను వడ్డిస్తారు. పాండి కర్రీ అంటే మరేదో కాదు.. పోర్క్‌ తో చేసిన డిష్‌. పూర్వం కొడవ ప్రజలు అడవి పందులను వేటాడి ఈ వంటకాన్ని చేసేవారు. అలా మొదలైన సంప్రదాయం ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం పెంపుడు పంది మాంసంతో దీన్ని తయారు చేస్తున్నారు. అయితే తినాలా వద్దా అనేది.. వాళ్ల వాళ్ల ఛాయిస్. బట్ సంప్రదాయం ప్రకారం పాండి కర్రీని వండిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Babu Mohan: నేను తినే పాన్‏లో విషం పెట్టి చంపాలనుకున్నారు..

Follow Us