AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్‌ మరణాలకు కారణం అదేనా ??

Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్‌ మరణాలకు కారణం అదేనా ??

Phani CH
|

Updated on: Feb 25, 2026 | 1:06 PM

Share

బెర్ముడా ట్రయాంగిల్‌లో ఓడలు, విమానాల అదృశ్యానికి అతీంద్రియ శక్తులు కారణమనే నమ్మకాలు ఇప్పుడు రోనాల్డ్‌ కాపర్‌ మీథేన్‌ గ్యాస్‌ సిద్ధాంతంతో పటాపంచలయ్యాయి. సముద్ర గర్భం నుండి మీథేన్‌ గ్యాస్‌ విడుదలైనప్పుడు నీటి సాంద్రత తగ్గి, ఓడలు మునిగిపోవడం, విమానాలు కూలిపోవడం జరుగుతుందని ఆయన పరిశోధనలు వెల్లడించాయి. దయ్యాల ట్రయాంగిల్‌కు అసలు కారణం ఇదేనని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

బెర్ముడా ట్రయాంగిల్‌ ప్రాంతంలో ఓడలు, విమానాలు మాయమైపోతుంటే ఇన్నాళ్లూ ఏ అతీంద్రియ శక్తులో, లేకుంటే ఏలియన్‌లో వాటిని మింగేస్తున్నాయని అనుకున్నాం. కాని, అందుకు కారణం మిథేన్‌ గ్యాస్‌ అని రోనాల్డ్‌ కాపర్‌ బృందం చేసిన పరిశోధన తాజాగా తేల్చేసింది! ‘వాట్‌ ఇఫ్‌ సైన్స్‌’ అనే సంస్థకు చెందిన పరిశోధకుడు రోనాల్ట్‌ కాపర్‌ థియరీని తాజాగా డైలీ మెయిల్ దినపత్రిక ప్రచురించింది. దీంతో ఈ థియరీ పై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. సముద్రం అడుగుభాగం నుండి అప్పుడప్పుడు మీథేన్‌ గ్యాస్‌ ఒక్కసారిగా బయటికి తన్నుకొస్తుందనీ, ఆ గ్యాస్‌ ధాటికి ఆ ప్రాంతం మీదుగా వెళ్లే ఓడలు బ్యాలెన్స్‌ తప్పి మునిగిపోవటం, విమానాల ఇంజన్లు మొరాయించి కూలిపోవటం జరిగి ఉండొచ్చని చెబుతున్నారు. అంతా ఇన్నాళ్లూ దయ్యాల ట్రయాంగిల్‌ అని భయపడితే, చివరికి అది సముద్రానికి వచ్చిన ‘గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌’ అని తేల్చేసారు! బెర్ముడా ట్రయాంగిల్‌ ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్రంలో ఒక ‘మాయాప్రాంతం’. 5 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలోని ఈ సముద్ర ప్రాంతం గురించి 500 ఏళ్లుగా ఓడల కాప్టెన్‌ల దగ్గర నుంచి, విమాన పైలట్లు, రైటర్లు, రీసెర్చ్‌ మేధావుల వరకు… అందరూ తలా ఒక థియరీతో, ఎవరి ఊహకు అందినట్లు వారు ఏదో చెప్పారు. బెర్ముడా ట్రయాంగిల్‌ ప్రమాదాలకు అసలు కారణం మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీనే. రోనాల్డ్‌ కాపర్‌ మీథేన్‌ గ్యాస్‌ సిద్ధాంతం ప్రకారం సముద్రం అడుగున గడ్డకట్టుకుపోయిన మీథేన్‌ గ్యాస్‌ ఒక్కసారిగా పెద్ద తేన్పుగా బద్దలై బయటకు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే నీటి సాంద్రత తగ్గుతుంది. అలా నీరు పల్చబడిపోతే, దాని మీద తేలుతూ వెళ్లే ఓడలకి ‘బ్యాలెన్స్’ తప్పుతుంది. ఇంకేముంది, ఏ సంకేతం, హెచ్చరిక లేకుండానే ఓడలు సముద్రం గర్భంలోకి జారిపోతాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పగలు కానిస్టేబుల్‌గా, రాత్రి ర్యాపిడో రైడర్‌గా.. కుటుంబ పోషణ కోసం తపన..చివరికి ఇలా

Mamta Mohandas: ‘రాజమౌళి అలా అనేసరికి నా గుండె పగిలిపోయింది’

Auto Ram Prasad: డైరెక్టర్‌గా కొత్త జర్నీ.. మొదలు పెట్టిన ఆటో రాంప్రసాద్

Yash: కటింగ్ చేసిన ‘సింహం’ మాదిరి.. KGF హీరో లుక్‌పై కామెడీ సెటైర్లు

‘కొడవ’ పద్దతిలో విజయ్, రష్మిక వివాహం.. ఈ పెళ్లి ప్రత్యేకలు ఏంటంటే ??

Follow Us